/rtv/media/media_files/2026/01/26/car-2026-01-26-13-37-42.jpg)
సోషల్ మీడియా(Social Media) లో వచ్చే ప్రకటనలను నమ్మి వెళ్తే ఒక్కోసారి ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో మల్లాపూర్ ఘటన కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది. మల్లాపూర్‌కు చెందిన రోషన్ అనే పాత కార్ల వ్యాపారి, కేవలం రూ. 26 వేలకే కారు ఇస్తానంటూ సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశాడు(car scam). ఇంత తక్కువ ధరకు కారు వస్తుందంటే ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. ఆ ప్రకటన చూసిన జనం తెల్లవారుజామునే కారు కొనేందుకు ఆయన షాపు వద్దకు భారీగా తరలివచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా కారు కోసం జనం క్యూ కట్టారు. - hyderabad
Also Read : మద్యం మత్తులో కారు డ్రైవర్ బీభత్సం: ఎస్‌ఐని అరకిలోమీటరు దూరం లాక్కెళ్లాడు!
రూ. 26 వేలకే కారు.. వ్యాపారిపై కేసు నమోదు
— ChotaNews App (@ChotaNewsApp) January 26, 2026
HYD: తక్కువ ధరకే కారు ఇస్తానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తప్పుడు ప్రకటన ఇచ్చిన పాత కార్ల వ్యాపారి రోషన్‌పై నాచారం పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం రూ. 26 వేలకే కారు అమ్ముతానని చెప్పడంతో, మల్లాపూర్‌లోని అతని దుకాణానికి తెల్లవారుజామునే ప్రజలు… pic.twitter.com/h5lIhvshfg
అయితే తీరా అక్కడికి వెళ్ళాక వ్యాపారి అసలు రంగు బయటపడింది. ప్రస్తుతం తన వద్ద కార్లు లేవని, ఆ ధరకు ఇవ్వడం కుదరదని ఆయన చెప్పడంతో వచ్చిన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తెల్లవారుజాము నుంచే వచ్చి ఎదురుచూస్తున్న జనం, అది కేవలం పబ్లిసిటీ కోసం చేసిన మోసమని గ్రహించి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. తమను మోసం చేశాడంటూ అక్కడే పార్క్ చేసి ఉన్న పాత కార్లపై రాళ్లదాడికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Also Raed : బాంబు పెట్టి లేపేస్తాం.. ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు లేఖ!
రోషన్‌పై కేసు నమోదు
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టించడమే కాకుండా గొడవకు కారణమైన రోషన్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడిని అరెస్టు చేసి నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి అతి తక్కువ ధర ఆఫర్లను చూసి మోసపోవద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారింది.
Follow Us