/rtv/media/media_files/2025/02/19/eDMONnMerOPdMvkO1jae.jpg)
washing machine incident
HYD NEWS: ప్రస్తుత జనరేషన్ లో టెక్నాలజీ వాడకం బాగా పెరిగిపోయింది. మనుషులు చేసే పనులు కూడా మెషిన్లే చేస్తున్నాయి. ఇలా ఇంట్లో చేసుకునే రోజూవారి పనులు కూడా మెషీన్స్ తోనే అయిపోతున్నాయి. బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషీన్లు(Washing Machines), అంట్లు తోమడానికి డిష్ వాషర్లు, వంట చేయడానికి కుక్కర్లు రకరకాల ఎలెక్ట్రిక్ పరికరాలను ఉపయోగిస్తున్నారు.
Also Read: Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్
అయితే వీటితో ఎంత ఈజీగా పనవుతుందో.. ఉపయోగించేటప్పుడు అంతే జాగ్రత్తగా కూడా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సంఘటనే ఇప్పుడు హైదరాబాద్ లో చోటుచేసుకుంది. ఓ బాలిక వాషింగ్ మెషీన్ యూజ్ చేస్తూ విద్యుత్ ఘాతానికి బలైంది.
Also Read: Lavanya: ఓవైపు రాజ్ ని ప్రేమిస్తూనే మస్తాన్ సాయితో బెడ్ రూమ్ లో.. లావణ్య గురించి ఫ్రెండ్ ప్రీతీ..
వాషింగ్ మెషీన్ వాడుతూ..
అలీ నగర్ ప్రాంతానికి చెందిన 17ఏళ్ళ ఫాతిమా బేగం అనే యువతి ఇంట్లో వాషింగ్ మెషీన్ వాడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కి గురైంది. బట్టలు వేస్తుండగా వైర్లు చేతికి తగలడంతో షాక్ కొట్టి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. చిన్న వయసులోనే కుమార్తె మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కుటుంబ సభ్యుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Also Read: MEIL: మేఘా కృష్ణారెడ్డికి బిగ్ షాక్.. ముంబై హైకోర్టులో జర్నలిస్ట్ రవి ప్రకాష్ పిల్!
గతంలో హాట్ వాటర్ బ్యాగ్..
గతంలో అల్వాల్ హాట్ వాటర్ బ్యాగ్ పగిలి రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు. బాలుడు ఆడుతూ హాట్ బ్యాగ్ పై పడడంతో.. పగిలి ఆ వేడి నీరు చిన్నారిపై పడ్డాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.
Also Read : కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు బిగ్ రిలీఫ్.. ముడా స్కామ్‌లో లోకాయుక్తా క్లీన్ చీట్