/rtv/media/media_files/2025/01/29/fhbJ16MlCA9hYJzwQ8ZQ.jpg)
Hyderabad Gachibowli sex racket case
Hyderabad: హైదరాబాద్ నగరం నడిబొడ్డున వ్యభిచారం గుట్టు రట్టు అయింది. గచ్చిబౌలి గౌలిదొడ్డి TNGO’S కాలనీలో ఫారిన్ అమ్మాయిలతో ఓ యువకుడు రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. 9 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు..
— greatandhra (@greatandhranews) January 29, 2025
గౌలిదొడ్డి TNGOS కాలనీలో ఫారెన్ అమ్మాయిలతో వ్యభిచారం.
వ్యభిచార గృహంపై మాదాపూర్ SOT, HTF అధికారుల దాడులు.
9 మంది ఫారెన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు... నిర్వహకుడి వేటలో పడ్డ మాదాపూర్ SOT టీమ్. pic.twitter.com/l5lvTM8XVT
కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ నుంచి..
ఈ ఘనట పూర్తి వివరాల్లోకి వెళితే.. గచ్చిబౌలి గౌలిదొడ్డి TNGO’S కాలనీలో ఫారిన్ అమ్మాయిలతో కొంతకాలంగా ఓ యువకుడు రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. 18- నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న కెన్యా, టాంజానియా, బ్యాంకాక్ కు చెందిన మహిళలను ఎరగా వేసి గలీజ్ దందా నడిపిస్తున్నాడు. అయితే స్థానికుల సమాచారంతో సీక్రెట్ ఆపరేషన్ చేపట్టిన మాదాపూర్ ఎస్ఓటీ, HTF అధికారులు బుధవారం వ్యభిచార గృహంపై దాడులు చేశారు. వ్యభిచార గృహంలో ఉన్న ఇద్దరు లీజు ఏజెంట్లు, ఒక కస్టమర్‌తో పాటు 9 మంది ఫారిన్ అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న నిర్వాహకుడి కోసం మాదాపూర్ ఎస్ఓటీ టీమ్ గాలిస్తోంది. టెలిగ్రామ్ యాప్ ద్వారా గత 3 నెలలుగా ఈ వ్యభిచారం నిర్వహిస్తోన్నట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: AP Crime: పట్టపగలే దారుణ హత్య.. చేపల కాపాలదారుడి పీక కోసి చంపిన యువకులు!
ఇదిలా ఉంటే.. సోమవారం అర్ధరాత్రి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో వ్యభిచారం గుట్టు రట్టు అయింది. రాజేష్ కుమార్ అనే వ్యక్తి కోఠి ఇసామియా బజార్ లోని ఓ భవనం అద్దె గదిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస చారి తెలిపారు. పక్కా సమాచారంతో దాడులు చేయగా అతనికి రైసా అనే మహిళ సహకరిస్తున్నట్లు తెలిసిందన్నారు. సెక్స్ వర్కర్లను పరిచయం చేసి, వారిని కస్టమర్ల వద్దకు పంపించినందుకు కమిషన్ తీసుకుంటుందని చెప్పారు. విటుడు వినయ్ సింగ్, నిర్వాహకులు రాజేష్ కుమార్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Budget 2025: బడ్జెట్‌కు సిద్ధం.. ఆర్థిక మంత్రి బృందంలో ఆ ఐదుగురిదే కీలక పాత్ర