Himayat Sagar: హైదరాబాద్‌లో ఈ ప్రాంత వాసులకు అలర్ట్

గురువారం హైదరాబాద్‌‌లో కురుసిన వర్షానికి హిమాయత్‌ సాగర్‌ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు జలాశయం ఒక గేటు ఎత్తి వరద నీటిని మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్‌ సాగర్‌ పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీరు 1762.70 అడుగులకు చేరింది.

New Update
himayat sagar

హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాలకు గురువారం వర్షం దంచికొట్టింది. దీంతో నగరంలో రోడ్లు నదులను తలపించాయి. భారీగా ట్రాఫిక్ పెరిగి వాహనదారులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిండుకుండలా మారాయి. జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇక భారీ వరద పోటెత్తడంతో నగర శివారులోని హిమాయత్‌ సాగర్‌ నిండుకుండలా మారింది.

జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది. దీంతో అధికారులు జలాశయం ఒక గేటు ఎత్తి వరద నీటిని మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్‌ సాగర్‌ పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీరు 1762.70 అడుగులకు చేరింది. జలాశయంలో పూర్తి నీటి నిల్వ 2.97 టీఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వ 2.73 టీఎంసీలకు చేరింది. హిమయత్‌సాగర్‌కు ప్రస్తుతం 1000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఔట్‌ ఫ్లో 339 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం నిండడంతో మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

గురువారం రాత్రి 11 గంటల వరకు యాదాద్రి జిల్లా ఆత్మకూరులో అత్యధికంగా 15.4 సెం.మీ వర్షం కురిసింది. నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 14.1 సెం.మీ, శేరిలింగంపల్లి పరిధి ఖాజాగూడలో 13.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో శుక్రవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు