/rtv/media/media_files/2025/04/18/5GIa6H9ferlXN00vuuDn.jpg)
హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, అమీర్‌పేట్, ఖైరతాబాద్, ఎస్‌ఆర్ నగర్, ఫిలింనగర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో దంచికొడుతుంది. కోఠి, దిల్‌షుక్‌నగర్, అంబర్‌పేట్, ఉప్పల్, సికింద్రాబాద్‌లో సాధారణంగా వర్షం కురుస్తోంది. దీంతో ఆఫీస్‌లు ముగిసే సమయం కావడంతో పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
నెమ్మదిగా ట్రాఫిక్
సికింద్రాబాద్-బేగంపేట మార్గంలో నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతుంది.. ఓల్డ్ బోయిన్‌పల్లి ఎయిర్‌పోర్ట్ మార్గంలో భారీగా వరదనీరు నిలిచిపోవడంతో చాలా వాహనాలు ఆగిపోయాయి. మాదాపూర్‌లో రోడ్డుపై భారీగా వరదనీరు నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.. నాంపల్లి రెడ్‌హిల్స్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌పై చెట్టు కూలింది.. నిజాం కాలేజ్ దగ్గర రోడ్డుపై వృక్షం కూలగా భారీగా ట్రాఫిక్ ఏర్పడింది.
HyderabadRains ALERT ⚠️⛈️
— Telangana Weatherman (@balaji25_t) April 18, 2025
1st round of SEVERE STORMS started in West HYD like Gachibowli, Nanakramguda, Manikonda will cover Shaikpet, Narsingi, Bandlaguda, Rajendranagar side next 1hr. This spell is small cameo as major spell awaits ⚠️
HyderabadRains ALERT 2 ⚠️
— Telangana Weatherman (@balaji25_t) April 18, 2025
Steering is absolutely zero. West HYD as marked in the areas will get CONTINOUS and SEVERE STORMS next 2hrs with strong winds and isolated hails. STAY ALERT ⚠️ pic.twitter.com/ujHlXd6qDo
మరో 3 రోజుల పాటు
హైదరాబాద్ లోనే కాకుండా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ కేంద్రం సూచించింది. ఇక ఈదురుగాలులు సైతం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందంది.
Also read : ట్రైన్లో నాపై అత్యాచారయత్నం జరిగింది.. బాధితురాలు సంచలన కామెంట్స్!