/rtv/media/media_files/2025/04/18/r5yaJvpdrocTqfTN34XA.jpg)
mmts-train victim
ఎమ్ఎమ్‌టీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్నం కేసులో ట్విస్టుల మీద ట్విస్టుల చోటుచేసుకుంటున్నాయి. బాధిత యువతిపై అత్యాచారయత్నమే జరగలేదని, రైలులో వెళ్తూ ఇన్‌స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం నడుస్తోంది. ఆ విషయం చెబితే అంతా తనను తిడతారని భయపడి పోలీసులకు కట్టుకథ చెప్పిందని రైల్వే పోలీసులు వెల్లడించారు.
నేను అలా చేయలేదు
దీనిపై స్పందించిన ఆ బాధిత యువతి.. తాను పోలీసులను తప్పుదోవ పట్టించలేదని అంటోంది. తనకు రీల్స్ చేసే అలవాటు లేదని ఆ యువతి చెబుతుంది. తనకు కేవలం స్నాప్‌లు తీసే అలవాటు మాత్రమే ఉందని తెలిపింది. అయితే MMTS రైలులో ప్రయాణిస్తున్నపుడు ఎలాంటి స్నాప్‌లు తీసుకోలేదని పేర్కొంది. తాను రీల్స్ చేస్తూ రైలు నుంచి జారి కింద పడిపోయినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆ బాధిత యువతి స్పష్టం చేసింది.
మరోవైపు పోలీసులు నిందితుడిని చూపించినప్పుడు తాను గుర్తు పట్టానని బాధితురాలు చెబుతోంది. ట్రైన్లో తనపై అత్యాచారయత్నం జరిగింది వాస్తవమేనని.. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తుండగా.. తనపై అత్యాచారయత్నం జరిగిందని, దుండగుడిని కట్టడి చేసేందుకు తాను ప్రయత్నించానని బాధితురాలు చెబుతోంది. దుండగుడి నుంచి తప్పించుకునేందుకే తాను ట్రైన్ నుంచి దూకేశానని వెల్లడించింది. దీనిపై పోలీసులు మరోమారు దర్యాప్తు చేయాలని కోరింది.
పోలీసులు మరోలా
అయితే పోలీసులు మరోలా చెబుతున్నారు. విచారణలో తమకు ఎక్కడా ఎలాంటి ఆధారాలు లేవన్నారు. దాదాపుగా 300కు పైగా సీసీ కెమెరాలను రైల్వే పోలీసులు పరీశిలించారు. దాదాపు 120 మంది అనుమానితులను ప్రశ్నించారు. చివరకు యువతిపై అత్యాచారం జరగలేదని తేల్చారు. న్యాయ సంబంధమైన అంశాలను పరిశీలించి కేసును మూసివేసే యోచనలో రైల్వే పోలీసులు ఉన్నారు.
వైరల్ అయిన సమాచారం ప్రకారం..
అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్‌ఫోన్ మరమ్మతు కోసం గత నెల మార్చిలో సికింద్రాబాద్‌కు వెళ్లి తిగిరి ఎంఎంటీఎస్‌లో మేడ్చల్‌కు బయలుదేరగా ఇన్ స్టా రీల్స్ చేస్తూ పొరపాటున కింద పడిపోయింది. దీన్ని కవర్ చేసేందుకు యువతి అత్యాచార నాటకం ఆడింది. గాయపడిన యువతిని ముందుగా గాంధీ ఆసుపత్రికి, ఆ తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుంది.
Also read : ట్రైన్లో నాపై అత్యాచారయత్నం జరిగింది.. బాధితురాలు సంచలన కామెంట్స్!
Also read; GST on UPI: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లుకు భారీ షాక్..!
telugu-news | Hyderabad MMTS train | MMTS Train Women | Hyderabad MMTS Incident | Hyderabad MMTS Rape Case