/rtv/media/media_files/2025/01/16/TsniSJJ1yBSNGwTdcii9.jpg)
Encounter specialist daya nayak and Saif alikhan
Mumbai: సైఫ్ ఆలీఖాన్‌పై కేసులో ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేసును ఛేదించడానికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు దయా నాయక్‌ను రంగంలోకి దించారు. ముంబై నేరస్థులకు సింహస్వప్నమైన దయా ఈ కేసును ఎలా ముగిస్తాడనేది మరింత ఆసక్తికరంగా మారింది.
వెకననుంచి కత్తిలో పొడిచి..
జనవరి 16 గురువారం తెల్లవారుజామున ముంబై నడిబొడ్డున ఉన్న బాంద్రాలోని ఇంట్లో సైఫ్‌పై దాడి జరిగింది. అర్ధరాత్రి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు కత్తితో అటాక్ చేయడం సంచలనం రేపుతోంది. దోచుకునేందుకు వచ్చిన వ్యక్తిని సైఫ్ సిబ్బంది అడ్డుకున్నప్పటికీ తన చేతిలో పదునైన ఆయుధంతో దాడి చేశాడు. సైఫ్ తన కుటుంబాన్ని, సిబ్బందిని రక్షించే ప్రయత్నం చేస్తుండగా వెనుక నుంచి అగంతకుడు కత్తితో పొడిచాడు. శరీరంపై ఆరు గాయాలైనట్లు లీలావతీ వైద్యులు తెలిపారు.
దయలేని దయా..
అయితే ఈ కేసును ముంబై పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. దాడి ఘటనపై ఇప్పటికే పలు కోణాల్లో విచారణ చేపట్టిన పోలీసులు.. ప్రముఖ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్‌కు ఈ కేసును అప్పగించడం సంచలనం రేపుతోంది. ముంబై మాఫియా, నేరస్తులకు సింహ స్పప్నమైన దయా.. ఎలా దర్యాప్తు చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. గతంలోనూ పెద్ద పెద్ద కేసును ఛేదించి గూండాలకు నిద్రలేకుండా చేసిన దయా.. బిష్ణోయ్ గ్యాంగ్ పై కన్నేసినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Akhanda 2: అఖండ 2' లో రియల్ అఘోరాలు.. కుంభమేళాలో షూటింగ్, ఫ్యాన్స్ కు పూనకాలే
తొలి ఎన్‌కౌంటర్ తోనే హడల్..
కర్ణాటక ఉడిపి ప్రాంతానికి చెందిన దయా నాయక్ మొదటిసారి 1995లో ముంబై జుహు పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరారు. జాయిన అయిన మొదటి ఏడాది డిసెంబర్ 31న తొలి ఎన్‌కౌంటర్ చేయడంతో దయా పేరు ముంబై మాఫియాలో వణుకుపుట్టించింది. ఇది మొదలు పదుల సంఖ్యలో ఎన్‌కౌంటర్లు చేశారు. అయితే కొంతకాలానికి అవినీతి ఆరోపణలపై ఏసీబీ దయాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు మరోసారి దయా ఎంట్రీపై ఉత్కంఠ నెలకొంది.