HYD: ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం

ఎప్పుడూ రద్దీగా ఉండే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ దగ్గర కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మెట్రో స్టేషన్ కింద విశ్వేశ్వరయ్య భవన్ వైపు పార్క్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి.

New Update
hyd

Fire Accident At Khairatabad Metro Satattion

హైదరాబాద్ లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వరసపెట్టి ఎక్కడో ఒక చోట మంటలు మండుతూనే ఉన్నాయి. తాజాగా కొద్ది సేపటి క్రితం ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కు దగ్గరలో  అగ్ని ప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ కింద విశ్వేశ్వరయ్య భవన్ వైపు పార్క్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రయాణికులు కాసేు ఆందోళనకు గురయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన మెట్రో సిబ్బంది స్టేషన్ లో లిఫ్ట్ ను నిలిచేశారు. దాని తరువాత అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఎక్కడా ఎవరికీ ఎటువంట హానీ జరగలేదు. అయితే మంటలు ఎలా అంటుకున్నాయి అన్నది మాత్రం తెలియలేదు. 

Also Read:Cricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం

Also Read: Gold: అమ్మో బంగారం..ఆల్ టైమ్ గరిష్టానికి..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు