BREAKING: 2గంటలుగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిలిచిపోయిన విమానం

ఇజ్రాయిల్‌తో యుద్ధం కారణంగా ఆదివారం ఇరాన్ గగనతలం మూసివేసింది. దీంతో హైదరాబాద్ నుంచి లండన్ బయల్దేరాల్సిన బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నిలిచిపోయింది. దాదాపు రెండు గంటలుగా రన్‌వే నెం.2పై విమానం టేకాఫ్ కాకుండా ఉంది.

New Update
Shamshabad airport

BREAKING: హైదరాబాద్ నుంచి లండన్ బయల్దేరాల్సిన బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో నిలిచిపోయింది. దాదాపు రెండు గంటలుగా రన్‌వే నెం.2పై విమానం టేకాఫ్ కాకుండా ఉంది. ఇజ్రాయిల్‌కు మద్దతుగా ఇరాన్‌పై ఆదివారం ఉదయం అమెరికా దాడులు చేసింది. దీంతో ఇరాన్ గగనతలం మూసివేసింది.

ఇజ్రాయిల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. యుద్ధం కారణంగా ఫ్లైట్ టేకాఫ్‌కు ఇంకా అనుమతి రాలేదని సిబ్బంది చెబుతున్నారు. దాదాపు రెండు గంటలుగా టేకాఫ్ తీసుకోకుండా విమానం రన్‌వేపైనే ఉంది. రన్‌వే నెం.2 పై విమానం నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు