Kidney Stone Cases: సమ్మర్ ఎఫెక్ట్..  హైదరాబాద్లో 60 శాతం పెరిగిన కిడ్నీలో రాళ్ల కేసులు

పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా హైదరాబాద్‌లో కిడ్నీలో రాళ్ల  కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని ఆసుపత్రులలో రోగుల సంఖ్య 60% కంటే ఎక్కువగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రతి వారం వందలాది మందికి చికిత్స కోసం వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

New Update
kidney stones

kidney stones

Kidney Stone Cases: పెరుగుతున్న ఉష్ణోగ్రతల(Summer) కారణంగా హైదరాబాద్‌లో(Hyderabad) కిడ్నీలో రాళ్ల  కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నగరంలోని కొన్ని ఆసుపత్రులలో రోగుల సంఖ్య 60% కంటే ఎక్కువగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రతి వారం వందలాది మందికి చికిత్స కోసం వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. నిమ్స్ లో  మార్చి, ఏప్రిల్ నెలల్లో నెలవారీ కేసుల సంఖ్య సాధారణంగా400 నుండి 450కి ఉంటే అది ఏకంగా750కి పెరిగిందని వైద్యులు తెలిపారు. 

ప్రధాన కారణాలు ఇవే! 

ఉస్మానియా జనరల్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్‌లో ఈ బాధితుల సంఖ్య1,000కి పెరిగింది. ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU) వంటి ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా రోగులు రద్దీ ఎక్కువగానే ఉంది. ప్రతిరోజూ 300 నుండి 400 కంటే ఎక్కువ మంది రోగులకు చికిత్స అందిస్తున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య తగినంత నీరు తీసుకోకపోవడం, ఉప్పు ఎక్కువ‌గా తిన‌డం వలన రోగుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం అని వైద్యులు చెబుతున్నారు. 

Also Read: BIG BREAKING: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం మరొక ముఖ్యమైన కారణంగా చెబుతున్నారు.  ప్రతిరోజూ 2.5 నుండి 3 లీటర్ల నీరు తీసుకోవడం చాలా అవసరమని డాక్టర్లు చెబుతున్నారు.  కిడ్నీలో రాళ్ల కేసులు 30 నుండి 60 సంవత్సరాల వయస్సు గల వారిలో ఎక్కువగా నమోదవుతున్నప్పటికీ, మూడు నుండి ఏడు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలు కూడా ఇలాంటి సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.

Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‎లో టెన్షన్ టెన్షన్..!

జన్యుపరంగానే కాకుండా, కలుషితమైన తాగునీటిని తీసుకోవడం వల్ల కూడా పిల్లలలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందంటున్నారు.  జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం కూడా మంచిది కాదని అంటున్నారు. మూత్రపిండాల్లో రాళ్ల  చికిత్స చేయకుండా వదిలేస్తే, అవి దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు (CKD)గా అభివృద్ధి చెందుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటిక‌ప్పుడు కిడ్నీ ప‌రీక్షలు చేయించుకోవ‌డం చాలా అవ‌స‌రమని వైద్యులు సూచిస్తున్నారు.  

Also read :  TG Crime : పిల్లలు పుట్టడం లేదని భార్యకు ఉరేసి చంపేశాడు..  జగిత్యాలలో దారుణం!

Advertisment
Advertisment
తాజా కథనాలు