మరో విషాదం.. అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన సందీప్ కుమార్ యాదవ్ (21) మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుత్బుల్లాపూర్‌లో ఉంటున్న అతడి తల్లిదండ్రులు కొడుకు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నారు. By B Aravind 19 Nov 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఓ యవకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన రాం ఆశీష్ కుటుంబం హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌లో ఉంటున్నారు. రాం ఆశీష్‌కు ఇద్దరు కుమారులు కాగా.. వారిలో చిన్న కొడుకు సందీప్ కుమార్ యాదవ్ (21). అయితే రెండేళ్ల క్రితమే సందీప్.. ఎమ్‌ఎస్ చెసేందుకు అమెరికాలోని ఒహియో వెళ్లాడు. Also Read: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి! నవంబర్ 17న (భారత కాలమాన ప్రకారం) రాత్రి తన ఫ్రెండ్‌తో కలిసి మరో ఫ్రెండ్‌ను కలిసేందుకు కారులో వెళ్లారు. రోడ్డుపై వెళ్తుండగా మార్గమధ్యంలో వీళ్లకు మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో సందీప్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతని స్నేహితుడు గాయాలతో బయటపడ్డాడు. సందీప్ గురించి సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కొడుకు మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం చేయాల్సిందిగా కోరుతున్నారు. Also Read: విజయ్ మాల్యా, నీరవ్ మోదీలను అప్పగించండి.. బ్రిటన్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి ఇదిలాఉండగా ఇటీవలే హైదరాబాద్‌కు చెందిన మరో ముగ్గురు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. టెక్సాస్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మొత్తంగా నలుగురు ఈ ఘటనలో మృతి చెందగా ముగ్గురు హైదరాబాద్ వాసులు. మరోకరు తమిళనాడుకు చెందినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ మధ్యకాలంలో అమెరికాలో భారతీయులు రోడ్డు ప్రమాదం మరణిస్తున్న ఘటనలు వరుసగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. Also Read: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే! Also Read: ఢిల్లీలో పీక్స్‌కు చేరిన కాలుష్యం.. త్వరలో కృత్రిమ వర్షం ! #telugu-news #hyderabad #usa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి