విజయ్ మాల్యా, నీరవ్‌ మోదీలను అప్పగించండి.. బ్రిటన్‌కు ప్రధాని మోదీ విజ్ఞప్తి

భారత్‌ నుంచి పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్‌ మోదీని అప్పగించాలని ప్రధాని మోదీ.. బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ను కోరారు. బ్రెజిల్‌లో జీ20 దేశాల సదస్సుకు వెళ్లిన ఆయన ఈ సందర్భంగా బ్రిటన్‌ ప్రధానికి ఈ అంశంపై విజ్ఞప్తి చేశారు.

New Update
modii

ప్రధానమంత్రి మోదీ విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన బ్రెజిల్‌లో పర్యటిస్తున్నారు. బ్రెజిల్ రాజధాని రియో డి జెనీరో వేదికగా జరుగుతున్న జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. అలాగే ఇతర దేశాధినేతలతో కూడా ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే బ్రిటన్ ప్రధాని కీర్‌ స్టార్మర్‌తో భేటీ అయ్యారు. భారత్‌లో బ్యాంకులకు టొకరా వేసి బ్రిటన్‌కు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు విజయ్ మాల్యా, నీరవ్‌ మోదీని అప్పగించాలని ప్రధాని మోదీ.. కీర్‌ స్టార్మర్‌ను కోరారు.  

Also Read: ఎంతకు తెగబడ్డారేంట్రా.. ఏకంగా RBI గవర్నర్ డీప్ ఫేక్ వీడియోను ఎలా చేశారో చూడండి!

Vijay Mallya - Nirav Modi 

భారత్‌లో రూ.9 వేల కోట్ల వరకు బ్యాంకు రుణాలను ఎగవేసిన విజయ్‌ మాల్యా 2016లో లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పంజాబ్ నేషనల్‌ బ్యాంకుకు నీరవ్‌ మోదీ దాదాపు రూ.14 వేల కోట్ల రుణం ఎగవేసిన వ్యవహారం 2018లో బయటపడింది. ఆ తర్వాత అతడు కూడా లండన్‌కు పారిపోయారు. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ, ఈడీ సంస్థలు విచారిస్తూనే ఉన్నాయి.  ఇప్పటికే నీరవ్‌ మోదీ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ ఇద్దరు ఆర్థికనేరగాళ్లను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నిస్తోంది. 

Also Read: CBSCలో ఓపెన్‌ బుక్‌ పరీక్షల విధానం.. క్లారిటీ ఇచ్చిన బోర్డు

అయితే నీరవ్‌ మోదీ తమ దేశంలోనే ఉన్నట్లు బ్రిటన్‌ సర్కార్‌ 2018 డిసెంబర్‌లో ప్రకటన చేసింది. అయితే తమకు అప్పగించాలని భారత్‌ విజ్ఞప్తి చేయగా.. 2019లో అక్కడి పోలీసులే అరెస్టు చేశారు. అతడిని భారత్‌కు అప్పజెప్పేందుకు బ్రిటన్ ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. దీంతో నీరవ్‌ మోదీ అక్కడి న్యాయస్థానంలో పిటిషన్ వేసారు. కానీ కోర్టు దీన్ని కొట్టేసింది. అయితే తాజాగా ఈ ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించాలని బ్రిటన్ ప్రధానికి మోదీ విజ్ఞప్తి చేశారు. అలాగే వీళ్లతో పాటు పన్ను ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మధ్యవర్తి సంజయ్‌ భండారీని కూడా భారత్‌కు రప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.   

Also Read: త్వరలో భారత్‌కు రష్యా అధ్యక్షుడు

Also Read :  వైసీపీ నుంచి పోటీ చేయను.. కీలక నేత సంచలన ప్రకటన!

Advertisment
తాజా కథనాలు