/rtv/media/media_files/2026/01/01/contaminated-water-2026-01-01-09-49-18.jpg)
water
వేసవి సీజన్ స్టార్ట్ కాకముందే తెలంగాణ వాసులకు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. నగరానికి ప్రధాన తాగునీటి వనరుల్లో ఒకటైన మంజీరా ఫేజ్-2 పైపులైన్‌కు అత్యవసర మరమ్మతులు చేపట్టాలని హైదరాబాద్ జలమండలి నిర్ణయించింది. ఈ క్రమంలో బుధవారం నుంచి గురువారం రాత్రి వరకు నగరంలోని కీలక ప్రాంతాల్లో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుందని తెలిపింది. దాదాపు రెండు రోజుల పాటు ఈ అంతరాయం ఉండనుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Malreddy Ranga Reddy : మంత్రి పదవి కోసం రాజీనామా చేస్తా..ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి కీలక వ్యాఖ్యలు
భారీగా లీకేజీలు ఉండటంతో..
నగరానికి తాగునీటిని సరఫరా చేసే 1500 ఎంఎం భారీ డయా పంపింగ్ మెయిన్ పైపులైన్‌లో పలుచోట్ల లీకేజీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పటాన్‌చెరు నుంచి హైదర్‌నగర్ వరకు, కలబుగూర్ నుంచి పటాన్‌చెరు మధ్య ఉన్న పైపులైన్లలో భారీగా నీరు వృథా అవుతోంది. ఈ లీకేజీల వల్ల నీటి సరఫరా ఒత్తిడి తగ్గి, చివరి ప్రాంతాలకు నీరు అందడం లేదు. వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి జలమండలి యుద్ధ ప్రాతిపదికన ఈ మరమ్మతు పనులను చేపట్టింది. పైపులైన్లలో వెల్డింగ్, ఇతర సాంకేతిక పనుల కోసం పంపింగ్ ఆపివేయడం తప్పనిసరని అధికారులు వివరించారు.
ఇది కూడా చూడండి: పశ్చిమ బెంగాల్ SIR ప్రక్రియను పొడిగించండి.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 12వ తేదీ గురువారం రాత్రి 10:00 గంటల వరకు సుమారుగా 40 గంటల పాటు నీటి సరఫరా ఉండదు. పనులు పూర్తయిన తర్వాత గురువారం అర్ధరాత్రి నుంచి వాటర్ మళ్లీ సరఫరా అవుతాయి. డివిజన్ 17 రామచంద్రాపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్, డివిజన్ 22 బీరంగూడ, అమీన్‌పూర్, భాగ్యనగర్ కాలనీ, డివిజన్ 6 ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట్, డివిజన్ 9 కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, ప్రగతి నగర్‌లో వాటర్ బంద్ ఉంటుందని తెలిపారు.
ఇది కూడా చూడండి: రూ.54 వేల కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Follow Us