Old city fire accidents: 365 రోజుల్లో 500లకు పైగా అగ్ని ప్రమాదాలు.. పాతబస్తీపై అధికారుల ఆందోళన!

హైదరాబాద్ ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంపై మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. గడిచిన ఈ ఏడాదిలో 500లకుపైగా ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ మొత్తం 2,500 ప్రమాదాలు జరిగితే 25% కేసులు పాతబస్తీలోనే ఉన్నాయని, ఇందుకు ప్రధాన కారణాలను వెల్లడించారు.

New Update
old city fr

Photos Reference from AI

Old city fire accidents: హైదరాబాద్ ఓల్డ్ సిటీ అగ్ని ప్రమాదంపై మరిన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి. గడిచిన ఈ ఏడాదిలోనే 500లకు పైగా అగ్ని ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్ మొత్తం 2,500 ప్రమాదాలు జరగగా 25% కేసులు పాతబస్తీలోనే నమోదైనట్లు వెల్లడించారు. 

పాతబస్తీలోనే 170 కేసులు..

ఈ మేరకు 2024 నుంచి ఇప్పటికీ అగ్ని ప్రమాదల వల్ల ఏడుగురు మరణించగా అనేక మంది గాయపడ్డట్లు తెలిపారు. ఈ పాతబస్తీలోనే 170 కేసులు కేసులు నమోదైనట్లు గౌలిగూడ అగ్నిమాపక కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్‌లోని 39 అగ్నిమాపక కేంద్రాలలో ఇవే అత్యధికం అని అధికారిక రికార్డులు చూపిస్తున్నాయి. గతవారం బేగమ్ బజార్‌లోని G+3  భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఎనిమిది మంది నివాసితులు ఎగసిపడుతున్న మంటల్లో చిక్కుకున్నారు. అదృష్టవశాత్తు వారందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సహాయ చర్యలకు ఇదే ఆటంకం.. 

అయితే ఓల్డ్ సిటీలో ప్రమాదాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని, నివాసితులు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అగ్నిమాపక అధికారులు తెలిపారు. 'గత రెండు, మూడు సంవత్సరాలుగా ప్రమాదాల సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఓల్డ్ సిటీలో వాణిజ్య కార్యకలాపాల కోసం నివాస భవనాలను ఉపయోగించే అలవాటు ప్రబలంగా ఉంది. అంతేకాకుండా భవనాలు రద్దీగా ఉండటం వల్ల సహాయక చర్యలు చేపట్టడం కష్టతరం అవుతోంది' అని అగ్నిమాపక సేవల డీజీ వై నాగిరెడ్డి చెప్పారు. 

ప్రధానమైన ముప్పు ఇదే..

మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించి, భవన యజమానులు నివాస స్థలాలను వాణిజ్య సంస్థలుగా మార్చడం దీనికి ముఖ్య కారణమని నిపుణులు అంటున్నారు. సరైన విద్యుత్ వైరింగ్ లేకపోవడం, సరిపడా మెట్లు, ప్రత్యేక ద్వారాలు, ఇతరత్రా అగ్నిమాపక భద్రతా చర్యలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మాణాలను నిర్మించారని చెబుతున్నారు. ప్రస్తుత విద్యుత్ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయకుండా ACలు, వాటర్ హీటర్, అదనపు ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వినియోగిస్తు్నే ఉన్నారు. ఫలితంగా లోడ్‌ను తట్టుకోలేక షార్ట్ సర్క్యూట్‌లకు దారితీస్తుందని JNTU హైదరాబాద్ స్ట్రక్చరల్ ఇంజనీర్ డీన్ కుమాన్ అన్నారు. ఈ నిర్మాణాలలో మెట్లకుగినంత స్థలం లేకపోవడం వల్ల బాధితుల తరలింపు ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుందని, ఇదే ప్రధానంగా నివాసితుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందన్నారు. 

Also Read: KL Rahul: టీ20ల్లో కోహ్లీ రికార్డు బ్రేక్.. చరిత్ర సృష్టించిన KL రాహుల్.. జీటీపై భారీ సెంచరీ!

సరైన వెంటిలేషన్ లేదు..

సరైన వెంటిలేషన్ లేకపోవడం చిన్న అగ్ని ప్రమాదాలు కూడా భారీ నష్టం కలిగించే అవకాశం ఉందని ధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదాల సమయంలో పొగ బయటకు వెళ్లేందుకు వెంటిలేషన్ లేకపోవడం వల్ల మంటలు చల్లబడట్లేదని డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి చెప్పారు. ఫీల్‌ఖానా రోడ్, బేగమ్ బజార్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నారు. ఇక్కడ చాలా భవనాలు కనీసం 50 నుండి 60 సంవత్సరాల పురాతనమైనవి. వ్యాపార యజమానులు తమ సెల్లార్‌లను చట్టవిరుద్ధంగా రిటైల్ స్థలాలుగా మార్చారు. అధికారులు ఈ అనధికార దుకాణాలను మూసివేసినప్పటికీ, యజమానులు తరచుగా కొన్ని వారాలు లేదా నెలల్లో కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నారని GHMC నగర ప్రణాళికదారు (చార్మినార్ జోన్) MA మజీద్ చెప్పారు.

Also Read: West Indies: వెస్టిండీస్‌కు కొత్త కెప్టెన్.. 2 ఏళ్ల విరామం తర్వాత సారథిగా జట్టులోకి!

 hyderabad old city | Fire Acc!dent | today telugu news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు