Hyderabad Metro: నిమజ్జనం స్పెషల్.. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో సేవలు

శనివారం గణేశ్‌ నిమజ్జన ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో..  ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి శనివారం ఉదయం గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటన చేసింది.

author-image
By B Aravind
New Update
Metro Special Services on Ganesh Immersion

Metro Special Services on Ganesh Immersion

శనివారం గణేశ్‌ నిమజ్జన ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో..  ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అన్ని మెట్రో స్టేషన్ల నుంచి శనివారం ఉదయం గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు సర్వీసులు అందుబాటులో ఉంటాయని ప్రకటన చేసింది. ఈ మేరకు ఎక్స్‌లో దీనికి సంబంధించి పోస్ట్ చేసింది. వినాయక నిమజ్జన ఉత్సవాలు చూసేందుకు చాలామంది హుస్సేన్‌సాగర్‌ సహా వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే మెట్రో సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది.  

అలాగే ఆర్టీసీ కూడా నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్‌కు తరలించేందుకు ఈ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. చార్మినార్ పరిధిలోని బర్కత్‌పురా, ముషీరాబాద్, కాచిగూడ, మెహదీపట్నం, ఫలక్‌నూమా, రాజేంద్రనగర్‌ డిపోలు, హయాత్‌నగర్‌ పరిధిలో చూసుకుంటే దిల్‌సుఖ్‌నగర్, హయత్‌నగర్ 1,2, మిథాని డిపోల నుంచి నిమజ్జన కార్యక్రమం కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. 

Also Read: Nara Lokesh: ఇక నుంచి క్యూఆర్ కోడ్‌తో రేషన్.. డిజిటల్ కార్డులు జారీ చేయనున్న ఏపీ సర్కార్‌!

కాచిగూడ, రాంనగర్‌ నుంచి బషీర్‌బాగ్‌ దాకా, వనస్థలీపురం, ఎల్బీనగర్‌, కొత్తపేట, మిథాని నుంచి ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వరకు బస్సులు రాకపోకలు చేయనున్నాయి. అలాగే పటాన్‌చెరు నుంచి లింగంపల్లి, జమై ఉస్మానియా నుంచి ఇందిరాపార్క్, లింగంపల్లి, గచ్చిబౌలి, రాజేంద్రనగర్‌ నుంచి లక్డీకాపూల్, అఫ్జల్‌గంజ్‌ నుంచి ఆలిండియా రేడియో వరకు బస్సుకు రాకపోకలు సాగనున్నాయి. 

మరోవైపు ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం గురించి హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కీలక విషయం తెలిపారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంట లోపే బడా గణేషుడి నిమజ్జనం ముగుస్తుందని తెలిపారు. గణేశ్ ఉత్సవాలకు సంబంధించి గత 20 రోజులుగా వివిధ ప్రభుత్వ శాఖలతో కలిసి మీటింగ్‌లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే నిమజ్జనాల కోసం అన్ని చెరువులు కూడా పరిశీలించామని పేర్కొన్నారు. రేపు జరగనున్న నిమజ్జన కార్యక్రమానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు.

Also Read: నా రాజీనామాకు కవితే కారణం.. బిగ్ బాంబ్ పేల్చిన కడియం!

 '' హుస్సేన్‌సాగర్, ట్యాంక్‌బండ్, NTR ఘాట్‌ వద్ద ఇప్పటికే 40 క్రేన్లను ఏర్పాటు చేశాం. పోలీసుల సూచనలు మండపాల నిర్వాహకులు పాటించాలి. ఒకవేళ విగ్రహాలు, వాహనాల ఎత్తు ఎక్కువగా ఉంటే పోలీసుల పర్మిషన్ తీసుకొని నిమజ్జనానికి బయలుదేరాలి. నగరంలో ప్రతి ప్రాంతపై కూడా మ్యాప్‌ వేసుకొని మార్గాలు నిర్ణయించాం. రోడ్లపై డైవర్షన్ ఉన్న ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశాం. మధ్యాహ్నం ఒంటి గంట లోపే ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం పూర్తవుతుంది. అందుకే మండప నిర్వాహకులు త్వరగా బయలుదేరి రావాలి. మొత్తం 29 వేల మందితో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నాం. నగరంలో దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనమవుతాయని'' సీవీ ఆనంద్ పేర్కొన్నారు. 

Advertisment
తాజా కథనాలు