ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన కామెంట్స్ చేశారు. తన రాజీనామాకు మాజీ ఎమ్మెల్సీ కవిత కారణమని అన్నారు. సీఎం కూతురు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని జైలుకు వెళ్లడం తనకు నచ్చలేదని, ఇది తనకు బాధకలిగించిదని అన్నారు. అందుకే తాను ఆ పార్టీకి రాజీనామా చేశానని అన్నారు. జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం నవాబుపేట రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. కవిత కుటుంబంలో జరుగుతున్నది ఆస్తి పంపకాలకు సంబంధించిన వివాదమన్నారు కడియం.
ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని
గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలోని వనరులన్నింటినీ దోచుకుందని కడియం ఆరోపించారు. ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని భూములన్నింటినీ కబ్జా చేశారని తెలిపారు. ఇక కాళ్వేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని కడియం తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ గొడవలు, తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అవినీతి డబ్బులను పంచుకోవడంలో వారి మధ్య జరిగిన గొడవే తప్పా.. మరి ఇంకా ఏం లేదన్నారు. కడియం చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.
కాగా గతంలో బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్న కడియం శ్రీహరి లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ నిర్ణయం ఆయన రాజకీయ జీవితంలో ఒక పెద్ద మలుపు. తన కూతురు కడియం కావ్యతో కలిసి ఆయన కాంగ్రెస్‌లో చేరారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, కడియం శ్రీహరి ఈ విషయంపై స్పందించారు. పార్టీల ఫిరాయింపుల చట్టాన్ని గతంలో బీఆర్‌ఎస్సే కాలరాసిందని ఆయన విమర్శించారు. స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అవసరమైతే ఉపఎన్నికలను ఎదుర్కోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
Also Read : Husband killed wife: షాకింగ్ వీడియో- విడాకుల విషయంలో లొల్లి.. నడిరొడ్డుపై కాల్చి చంపిన భర్త
తెలుగుదేశం పార్టీలో చేరి
కడియం శ్రీహరి 1952లో వరంగల్ జిల్లాలో జన్మించారు. తన వృత్తి జీవితాన్ని బ్యాంకు మేనేజర్‌గా, ఆ తర్వాత జూనియర్ లెక్చరర్‌గా ప్రారంభించారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి, ఎన్.టి.రామారావు, చంద్రబాబు నాయుడు మంత్రివర్గాల్లో కీలక శాఖల మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం ఉపముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కూడా చురుగ్గా ఉన్నారు.
Also Read : Crime News : అత్తమామలకు మత్తు మందు ఇచ్చి.. ఎదురింటోడితో తోటి కోడళ్లు జంప్!
BIG BREAKING: నా రాజీనామాకు కవితే కారణం.. బిగ్ బాంబ్ పేల్చిన కడియం!
ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన కామెంట్స్ చేశారు. తన రాజీనామాకు మాజీ ఎమ్మెల్సీ కవిత కారణమని అన్నారు. సీఎం కూతురు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని జైలుకు వెళ్లడం తనకు నచ్చలేదని, ఇది తనకు బాధకలిగించిదని అన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన కామెంట్స్ చేశారు. తన రాజీనామాకు మాజీ ఎమ్మెల్సీ కవిత కారణమని అన్నారు. సీఎం కూతురు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని జైలుకు వెళ్లడం తనకు నచ్చలేదని, ఇది తనకు బాధకలిగించిదని అన్నారు. అందుకే తాను ఆ పార్టీకి రాజీనామా చేశానని అన్నారు. జనగామ జిల్లాలోని లింగాల గణపురం మండలం నవాబుపేట రిజర్వాయర్ నుంచి సాగునీటిని విడుదల చేశారు. అనంతరం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. కవిత కుటుంబంలో జరుగుతున్నది ఆస్తి పంపకాలకు సంబంధించిన వివాదమన్నారు కడియం.
ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని
గత పదేళ్లుగా అధికారంలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తెలంగాణలోని వనరులన్నింటినీ దోచుకుందని కడియం ఆరోపించారు. ధరణి పోర్టల్ ను అడ్డం పెట్టుకుని భూములన్నింటినీ కబ్జా చేశారని తెలిపారు. ఇక కాళ్వేశ్వరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని కడియం తీవ్రమైన ఆరోపణలు చేశారు. కేసీఆర్ కుటుంబ గొడవలు, తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అవినీతి డబ్బులను పంచుకోవడంలో వారి మధ్య జరిగిన గొడవే తప్పా.. మరి ఇంకా ఏం లేదన్నారు. కడియం చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.
Also Read : Viral video: నీకు ఎంత ధైర్యం?.. IASకు డిప్యూటీ సీఎం బెదిరింపులు.. వీడియో వైరల్!