/rtv/media/media_files/2025/02/17/0WM4d5IDeNyoh72BQ1oB.jpg)
Kidney Racket
హైదరాబాద్‌లో సరూర్‌నగర్ అలకనంద ఆస్పత్రి కిడ్నీ రాకెట్ కేసు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడు పవన్ విదేశాలకు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. గత మూడు వారాలుగా అతడి ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు అతడు విదేశాలకు పారిపోయిడని గుర్తించి లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: సీఈసీ ఎంపికపై కమిటీ భేటి.. ఆయనకే బాధ్యతలు అప్పగిస్తున్నారా ?
మరోవైపు ఈ కేసులో మరో నిందితుడు లక్ష్మణ్‌ను ఇటీవలే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కిడ్నీ రాకెట్ వ్యవహారంలో అతడు మధ్యవర్తిగా ఉంటూ కమీషన్లు దండుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఈ అక్రమ కిడ్నీ మార్పిడి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన పవన్‌కు లక్ష్మణ్ ముఖ్య అనుచరుడిగా ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే ఇదే కేసులో ఇప్పటిదాక పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఒక్కొక్కరిని కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. అయితే ఇప్పటికే అలకనంద ఆస్పత్రి ఛైర్మన్ సుమంత్, డాక్టర్ అవినాశ్‌ను విచారించారు.
Also Read: బాలరాముడికి భారీగా విరాళాలు.. అమోధ్య రామమందిరం ఆదాయం దేశంలోనే
తాజాగా విశాఖపట్నంకు చెందిన డా.రాజశేఖర్‌ను కూడా విచారించారు. లక్షల రూపాయలు తీసుకుంటూ అక్రమ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసినట్లు గుర్తించిన పోలీసులు ఇటీవలే అతడిని అరెస్టు చేసి విశాఖలో రిమాండ్‌కు తరలించారు. రాజశేఖర్‌ను మూడు రోజుల కస్టడీకి అప్పగించారు. ఈ నేపథ్యంలోనే మొదటిరోజు సోమవారం పోలీసులు విచారించారు. అయితే ఈ కిడ్నీ రాకెట్ నడిపిస్తున్న నిందితులు.. కిడ్నీ దాతలకు కేవలం రూ.5 లక్షలు ఇచ్చి.. కిడ్నీ తీసుకునేవారికి మాత్రం రూ.50 నుంచి 55 లక్షల వరకు దండుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఉన్న కీలకంగా ఉన్న ప్రధాన నిందితుడు పవన్ దొరికితే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.
Also Read: ఏపీలో భారీగా జీబీఎస్ కేసులు.. ఆరోగ్య మంత్రి సత్యకుమార్ సంచలన ప్రకటన!