CEC: సీఈసీ ఎంపికపై కమిటీ భేటి.. ఆయనకే బాధ్యతలు అప్పగిస్తున్నారా ?

సీఈసీ ఎంపికపై ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, విపక్ష నేత రాహుల్‌ గాంధీలు ఈ భేటీలో పాల్గొన్నారు. తదుపరి సీఈసీని ఎంపిక చేసి రాష్ట్రపతికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

New Update
Election Commission

Election Commission

ప్రస్తుత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌ ఫిబ్రవరి 18తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త సీఈసీ ఎంపికపై ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం ఉన్నత స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, విపక్ష నేత రాహుల్‌ గాంధీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో తదుపరి సీఈసీని ఎంపిక చేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.

మరికొన్ని గంటల్లో కొత్త సీఈసీ ఎవరు అనేదానిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు కొత్త సీఈసీ ఎంపికను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సీఈసీ ఎంపిక ప్రక్రియను సవాలు చేస్తూ ఇటీవలే కాంగ్రెస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరి 19న ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. 

Also Read: రైల్వే స్టేషన్‌తో తొక్కిసలాట.. బిడ్డను ఎత్తుకొని డ్యూటీ చేసిన మహిళా కానిస్టేబుల్

ఈ నేపథ్యంలోనే సీఈసీ ఎంపిక ప్రక్రియను వాయిదా వేయాలని కాంగ్రెస్ లీడర్ అభిషేక్ మనుసింఘ్వీ డిమాండ్ చేశారు. సీఈసీ సెలక్షన్ కమిటీ మార్గదర్శకాల్లో కొన్ని సవరణలతో ప్రభుత్వం నియంత్రణ కోరుకుంటోదని ఆరోపించారు. ఈ సమావేశానికి వాస్తవానికి రాహుల్‌ గాంధీ కూడా హాజరయ్యారు. కానీ రాహుల్ ఏం మాట్లాడరనే విషయాన్ని అభిషేక్ మనుసింఘ్వీ చెప్పలేదు.

అయితే నూతన సీఈసీగా కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి జ్ఞానేశ్‌ కుమార్‌ను ఎంపిక చేసే ఛాన్స్‌  ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది ప్రస్తుతం ఆయన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా పని చేస్తున్నారు. అలాగే అంతకుముందు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో సహకార మంత్రిత్వ శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల కార్యదర్శిగా పనిచేశారు. ఆ తర్వాత రిటైర్ కూడా అయ్యారు. అనంతరం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ ఏర్పాటు చేయడంతో పాటు అయోధ్య కేసుపై సుప్రీం కోర్టు తీర్పునకు సంబంధించి అన్ని అంశాలు చూసుకునేందుకు హోం మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగానికి నాయకత్వం వహించారు.

Also Read: ఈ స్టూడెంట్ ఐడియాకు సెల్యూట్.. టైం లేదని ఎగ్జామ్ సెంటర్‌కు ఎలా వచ్చాడంటే..?    

ఇదిలాఉండగా రాజీవ్‌ కుమార్‌ మే 15, 2022న 25వ సీఈసీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన బీహార్‌/జార్ఖండ్‌ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్‌ ఐఏఎస్ అధికారి. రాజీవ్‌ కుమార్ తన పదవి కాలంలో 2022లో 16వ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో సహా మొత్తం 11 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల కమిషనర్‌ పదవి చేపట్టకముందు.. ఫైనాన్స్ సెక్రటరీ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డ్ ఛైర్మన్‌తో సహా పలు కీలక పదవులు చేపట్టారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు