HYD: ఓరి కుర్ర కుంక.. ట్యూషన్‌కి పంపితే.. ఇంట్లో రూ.2లక్షలు దొంగలించి టీచర్‌కి ఇచ్చాడు- HYD విద్యార్థి అరాచకం!

HYDలోని జీడిమెట్లలో విచిత్ర సంఘటన జరిగింది. చదువుకోమని ట్యూషన్‌కు పంపిస్తే.. ఓ విద్యార్థి ఇంట్లో దొంగతనం చేసి రూ.2లక్షల రూపాయలను ట్యూషన్ టీచర్‌కు ఇచ్చాడు. ఐఫోన్ కొనివ్వగా.. డబ్బులు మాత్రమే అడిగింది. అది అమ్మి డబ్బులను టీచర్‌కు ఇచ్చాడు. చివరికి దొరికాడు.

New Update
HYD

Jeedimetla Student stole 2 lakh rupees from home and gave it to tuition teacher

ఈ మధ్య కాలంలో యువత ఆలోచనలు ఊహకందడం లేదు. వయసుకు మించిన అతి తెలివి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి పిల్లలు అప్డేటెడ్‌గా ఉండటం మంచిదే.. కానీ అది ఇతరులకు ప్రమాదంగా మారకూడదు. తాజాగా ఓ యువకుడు చేసిన పని వల్ల ఇంట్లో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. చదువుకోరా బాబు అని ట్యూషన్‌కి పంపిస్తే.. అది మానేసి ఇంట్లో ఉన్న లక్షల డబ్బును కాజేసి ట్యూషన్ టీచర్‌కు ఇచ్చాడో కుర్రాడు. తెలంగాణలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. 

Also Read: పాక్ జర్నలిస్టులకు షాక్ ఇచ్చిన భారత్.. కేంద్రం సంచలన నిర్ణయం

రూ.2 లక్షల చోరీ చేసి

హైదరాబాద్‌లోని జీడిమెట్లలో జరిగిన ఈ ఘటనతో స్థానిక ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఇందుకు సంబంధించి వారి పేర్లు బయటకు రానప్పటికీ.. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. జీడిమెట్లకు చెందిన ఓ తల్లిదండ్రులు చదువుకోమ్మని తమ కొడుకును ట్యూషన్‌కు పంపించారు. అయితే ట్యూషన్‌లో టీచర్‌కు ఆ స్టూడెంట్‌కు మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ.. ఇంట్లో దొంగతనం చేసి లక్షల రూపాయలు ఆ ట్యూషన్ టీచర్‌కు ఇచ్చాడు. 

Also Read: హర్యానాలో ఐస్ క్రీంలు అమ్ముకుంటున్న పాక్ ఎంపీ.. ఆయన కన్నీటి కథ ఇదే!

అది మాత్రమే కాకుండా లక్షల ఖరీదైన ఐఫోన్‌ను కూడా కొనిచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఐఫోన్ వద్దని.. తనకు డబ్బులు మాత్రమే కావాలని టీచర్ అడగడంతో దాన్ని అమ్మి రూ.2 లక్షలను ఆమెకు ఇచ్చాడు ఆ కుర్రాడు. అక్కడ వరకు బాగానే ఉన్నా.. ఆ కుర్రాడు ఐఫోన్ అమ్మిన విషయం మొబైల్ షాప్ యజమాని.. ఆ కుర్రాడి తండ్రికి చెప్పాడు. దీంతో ఈ విషయం బట్టబయలైంది. మొత్తంగా చూసుకుంటే ఆ ట్యూషన్ టీచర్ అడగడంతోనే.. కుర్రాడు తన ఇంట్లో దొంగతనం చేసినట్లు తెలుస్తోంది. 

Also read :  Andhra Pradesh: వారికి రూ.8 లక్షలు.. సీఎం చంద్రబాబు అదిరిపోయే గుడ్ న్యూస్

ఇక కొడుకు చేసిన పనికి తండ్రి అవాక్కయ్యాడు. చివరికి ఏం చేయాలో తెలియక పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా.. వారు పట్టించుకోవడం లేదని అతడు వాపోతున్నాడు. ఈ మేరకు ఆ ట్యూషన్ టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని HRCకి కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడీ ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. 

crime news | latest-telugu-news | telugu-news | telangana-crime

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు