/rtv/media/media_files/2025/07/14/elderly-woman-duped-of-1-lakh-rupees-by-cyber-fraudsters-in-hyderabad-2025-07-14-18-51-36.jpg)
Cyber Fraud
Cyber Fraud: నేటి కాలంలో సైబర్ మోసాలు అధికంగా పెరిగిపోతూ ప్రజలను నిండా ముంచుతున్నాయి. మారుమూల పల్లెల నుంచి అటవీ ప్రాంతాల్లో కూర్చొని సైబర్ మాయగాళ్లు రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ సైబర్ మోసాలపై సరైన అవగాహన పెంచుకోవటం ముఖ్యం. అవగాహన లేకపోతే బాధితులు ఎక్కువగా మోసాలకు అవుతున్నారని పోలీసులు గుర్తించారు. ఈ సమస్యను తగ్గించాలని కాలనీలు, విద్యాసంస్థల్లో సదస్సులు పెట్టి అవగాహన కల్పిస్తున్నారు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. పోలీసుల ప్రయత్నాలు ఫలిస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే గతేడాది హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్టు కేసులు 6 నెలల్లో 140 నమోదైతే.. ఈ ఏడాది 34 మాత్రమే రావటం వల్ల ఇది మంచి పరిణామమని చెప్పవచ్చు.
కొత్త మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
మోసగాళ్లూ ఇప్పుడు కొత్త ఎత్తులు వేస్తున్నారు. రూ. లక్షల్లో లాభాలు వస్తాయని ఊదరగొడతారు. నకిలీ డిజిటల్ ఖాతాలు తెరిపించి, లాభాలు ఎక్కువగా వస్తున్నట్టు చెబుతారు. బాధితుల ఆర్థిక స్థాయిని అంచనా వేసి ఆశించిన సొమ్ము వారి ఖాతాల్లోకి వెళ్లగానే ముఖం చాటేస్తారు. మహిళలు, చిన్న ఉదోగ్యాలు చేసేవారు, విద్యార్థులు అప్పు చేసి, నగలు తాకట్టు పెట్టి ఇలాంటి పెట్టుబడులు పెడుతున్నారు. మంచి లాభాలు వస్తాయని కట్టిన కొందరూ ఇలాంటి మోసాలు వల్ల ఇబ్బందులు వస్తాయని మౌనంగా ఉంటున్నారు.
ఇది కూడా చదవండి: ఈడీ అదుపులో తలసాని మాజీ OSD కళ్యాణ్
పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, పెట్టుబడితో రెట్టింపు లాభాలు, ట్రేడింగ్ ద్వారా డబ్బు నాలుగైదు రెట్లు కావడం వంటి ప్రకటనలు సైబర్ క్రైమ్ పోలీసుల అవగాహన కార్యక్రమాల్లో ఇప్పుడు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్లలో జోడు కోసం వెతికే యువతి, యువకులను పెళ్లి పేరిట బురిడీ కొట్టిస్తున్నారు. నగర సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో అధికశాతం ఇవే ఉంటున్నాయి.
అప్రమత్తంగా ఉండండి:
పెట్టుబడి పేరుతో జరిగే మోసాల్లో తొలుత వాట్సప్ గ్రూపులో చేరుస్తారు. దేశ, విదేశాల్లోని కంపెనీల స్టాక్స్ కొనుగోలు చేయమంటారు. అప్పటికే ఆ గ్రూపులో ఉన్న ఏజెంట్లు తమకు ఏఐతో ప్రముఖులు సూచించినట్టు డిజిటల్ అరెస్టులు, కస్టమర్ కేర్ కేంద్రాల మోసాలను పసిగట్టేందుకు సమయస్ఫూర్తి చాలు. సామాజిక మాధ్యమాలు, వెబ్‌సైట్ల ద్వారా స్టాక్ మార్కెట్, కంపెనీల్లో పెట్టుబడులు అంటూ కృత్రిమ మేధ (AI) ద్వారా ప్రముఖులు సూచించినట్టు మోసగాళ్లు చక్కని ప్రకటనలతో ఆకట్టుకుంటున్నారు. బ్యాంకులు కూడా ఇవ్వని వడ్డీలు వస్తాయని చెబుతుంటే మోసగాళ్ల ప్రకటనలు పన్నాగమని గుర్తించాలి.
ఫిర్యాదు:
మోసాలు జరిగిన వెంటనే ఫిర్యాదు చేయాలి. ఇలా కేసు నమోదు చేసి మాయగాళ్ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నారు. అంతర్రాష్ట్ర నిందితులను అరెస్ట్ చేస్తున్నారు. ఫిర్యాదులో జాప్యంతో నిందితులు డబ్బు ఇతర ఖాతాల్లోకి మళ్లించి, బిట్‌కాయిన్, క్రిప్టోగా మార్చి విదేశాలకు తరలిస్తున్నారు. బాధితులు గంట వ్యవధిలో ఫిర్యాదు చేస్తే నగదు జమ చేసిన బ్యాంకు ఖాతాల లావాదేవీలను నిలిపి వేయవచ్చు. అత్యవసరమైతే *87126 6517* వాట్సప్ నంబర్‌కు సమాచారమివ్వటంతోపాటు 1930కి కాల్ చేయాలి. లేదా cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు.
ఇది కూడా చదవండి: సృష్టి కేసులో సంచలనం..సరోగసి చేయకున్న చేసినట్లు నమ్మించాం...డాక్టర్ నమ్రత వాంగ్మూలం
( cyber-fraud | cyber fraud news | cyber fraud telugu | hyd police busted cyber frauds | Latest News | telugu-news)