Aurobindo: 108, 104 సర్వీసుల నుంచి అరబిందో ఔట్
అరబిందో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 108, 104 అంబులెన్స్ సర్వీసుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రభుత్వానికి తెలిపింది. టెండరు గడువు ముగియడానికి ఇంకా రెండున్నరేళ్ల వరకు గడువు ఉంది. ఈ నిర్ణయంతో ఈ సర్వీసుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లు పిలువనుంది.