/rtv/media/media_files/2025/09/26/madhya-pradesh-crime-news-2025-09-26-17-54-16.jpg)
Madhya Pradesh Crime News
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ప్రేమోన్మాదం పరాకాష్టకు చేరిన దారుణ ఘటన చోటు చేసుకుంది. తమతో తెంచుకున్న సంబంధాన్ని తిరిగి కొనసాగించడానికి నిరాకరించిన యువతిపై ఓ మాజీ ప్రియుడు అత్యంత క్రూరంగా దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన గురువారం సాయంత్రం కల్పనా నగర్ ప్రాంతంలో జరిగింది. గతంలో ప్రేమించుకున్న ఈ జంట కొద్ది రోజుల క్రితం విడిపోయారు. అయితే ఆ యువకుడు తన మాజీ ప్రేయసిని మళ్లీ సంబంధం కొనసాగించాలని బలవంతం చేస్తూ.. బెదిరింపులకు పాల్పడ్డాడు. యువతి అందుకు నిరాకరించడంతో అతని ప్రవర్తన హింసాత్మకంగా మారింది.
యువతిపై స్కూటర్‌తో దాడి..
ఘటన జరిగిన రోజున యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. ఆ యువకుడు యాక్టివా స్కూటర్‌పై వేగంగా వచ్చి ఆమెను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టడానికి ప్రయత్నించాడు. గమనించిన యువతి అతనిపై రాయి విసిరి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ఆ యువకుడు మరింత వేగంగా వచ్చి తన స్కూటర్‌తో ఆమెను బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పారిపోయాడు.
బ్రేక్ అప్ చెప్పినందుకు యువతిని బైక్ తో 'ఢీ' కొట్టిన మాజీ ప్రేమికుడు.
— greatandhra (@greatandhranews) September 26, 2025
గాయాలపాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటన మధ్యప్రదేశ్ ఇండోర్ లో చోటు చేసుకుంది. pic.twitter.com/OmAKdH2jUZ
ఇది కూడా చదవండి: అయ్యో బిడ్డలు.. ఆడుకోవడానికి వెళ్లి అనంతలోకాలకు.. విషాదాంతమైన నెల్లూరు చిన్నారుల మిస్సింగ్!
ఈ దాడిలో గాయపడిన యువతి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అనంతరం ఆమె హిరానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి వాంగ్మూలం ఆధారంగా పోలీసులు ఆరోపించిన వ్యక్తిపై దాడి, బెదిరింపు మరియు ఉద్దేశపూర్వక హాని కేసు నమోదు చేశారు. హిరానగర్ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ..దర్యాప్తులో ఆ యువకుడికి నేర చరిత్ర ఉందని.. అతను పలు నేరాలకు పాల్పడే వ్యక్తి అని తేలింది. అతనిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో ఏడు నేర కేసులు నమోదయ్యాయి. నిందితుడిని గుర్తించి.. అతని కోసం గాలింపు చేపట్టాం. త్వరలోనే అతన్ని అరెస్టు చేస్తామని తెలిపారు.
ఇది కూడా చదవండి: ఏపీలో దారుణం.. లారీతో తొక్కించి ఇద్దరి హత్య.. రూ.200 కోసం!