TG Crime: హైదరాబాద్‌లో దారుణం.. సూట్‌కేస్‌లో గుర్తు తెలియని మహిళ మృతదేహం

హైదరాబాద్‌లోని బాచుపల్లి పీఎస్‌ పరిధిలో సూట్‌కేసులో మహిళా మృతదేహం కలకలం రేపింది. నిర్మానుష్య ప్రాంతంలో సూట్ కేసు నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

New Update
bachupalli crime news

bachupalli crime news

Bachupalli Crime News:హైదరాబాద్‌ శివారులోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. కాలనీలోని రెడ్డిస్ ల్యాబ్ గోడ పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఉంచిన ఓ సూట్‌కేస్ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేశారు. విచారణలో సూట్‌కేస్‌ను ఓపెన్ చేయగా అందులో గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడింది. మృతురాలు సుమారు 25 నుంచి 35 సంవత్సరాల వయస్సులో ఉండి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఆమె మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్సు ధరించి ఉండటం పోలీసులు గుర్తించారు.

Also Read :  18 ఏళ్ల కల..18 గంటల్లోనే  విషాదం.. తొక్కిసలాటకు ఐదు కారణాలు

సూట్‌కేస్‌లో మహిళ మృతదేహం..

ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఏ కారణంతో ఆమెను హత్య చేశారో, ఎవరు చేసి ఉంటారో అన్న అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాన్ని చూసిన ప్రక్కనివారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మహిళ శరీరాన్ని గుర్తు పట్టకుండా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసును పరిశీలిస్తున్న పోలీసులు.. మృతురాలి గుర్తింపును నిర్ధారించేందుకు ఆధారాలు సేకరిస్తున్నారు. హత్య జరిగిన స్థలానికి దగ్గరలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో విషాదం.. ఒకే గదిలో తల్లి, కుమారుడి మృతి

Also Read :  ఎంగేజ్మెంట్ చేసుకున్న కుల్దీప్.. ఆమె మరెవరో కాదు

ఈ కేసును బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. మృతురాలి ఆచూకీ, ఆమె కుటుంబీకుల వివరాలు తెలుసుకునే దిశగా అనేక కోణాల్లో విచారణ జరుగుతోంది. ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో, ఇటీవల ఎవరితోనైనా తగాదా జరిగిందా అన్న కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఏవైనా వివరాలు తెలిసిన వారు వెంటనే బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.  

( ts-crime | ts-crime-news | Latest News | telugu-news | crime)

ఇది కూడా చదవండి: ఆరోగ్యకరమైన భోజనం తినడానికి సమయం లేదా? వీటితో మీ ప్రాబ్లం సాల్వ్

Advertisment
తాజా కథనాలు