BIG BREAKING : వరంగల్ లో హైటెన్షన్..

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.భూ వివాదంలో రెండ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మాదన్నపేట రోడ్డులో గల త్రిబుల్ వన్ అసైన్డ్ భూమి లో గల 4 ఎకరాలలో పనులు జరుపుతున్నారంటూ ఓ వర్గం వారిని మరో వర్గం వారు అడ్డుకున్నారు.

New Update

BIG BREAKING : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.భూ వివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. మాదన్నపేట రోడ్డులో గల త్రిబుల్ వన్ అసైన్డ్ భూమి(సర్వే నెం-111)లో గల 4 ఎకరాలలో పనులు జరుపుతున్నారంటూ ఓ వర్గం వారిని మరో వర్గం వారు అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మాట మాట పెరిగి రాళ్లదాడి చేసుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Also read: china heart attack vaccine: చైనా సైంటిస్టుల అద్భుతం.. గుండెపోటు, స్ట్రోక్స్ రాకుండా వ్యాక్సిన్!
 
2019లో ఓ మాజీ మిలిటరీ అధికారికి చెందిన భూమిని.. బీఆర్ఎస్ కు చెందిన రామస్వామి నాయక్ అతని స్నేహితులు కలిసి నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఎకరం రూ.50 లక్షలు చొప్పున మూడు ఎకరాల భూమికి కోటి 50 లక్షలు భూయజమానులకు చెల్లించారు. అసైన్డ్ భూమి కావడం.. వివాదం కోర్టులో ఉండటంతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాలేదు. దీంతో మిగతా డబ్బులు చెల్లించడానికి ముందుకు రాకపోవడంతో భూ వివాదం అలాగే ఉంది. 2019 నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది.


 ఇది కూడా చూడండి: Lalit Modi: 'వనువాటు అందమైన దేశం'.. లలిత్‌ మోదీ సంచలన పోస్ట్‌

ఈ నేపథ్యంలో మరలా ఆ భూమిని కాంగ్రెస్ పార్టీకి చెందిన రామానంద్ అతని స్నేహితులు కలిసి 2024లో  కొనుగోలు చేశారు. అప్పటినుండి ఈ భూమి విషయంలో ఇరు వర్గాల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ వివాదం కోర్టులో నడుస్తుండగా నేడు ఇరు వర్గాలకు చెందిన కొందరు భూమిలో పనులు జరుపుతున్నారని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య రాళ్ల దాడి జరిగింది. దాడిలో బాలకృష్ణ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కాగా.. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని లాఠీచార్జ్‌ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

ఇది కూడా చదవండి: రోజంతా నిద్రపోతున్నారా.. ఈ సమస్యకు కారణం ఇదే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు