china heart attack vaccine: చైనా సైంటిస్టుల అద్భుతం.. గుండెపోటు, స్ట్రోక్స్ రాకుండా వ్యాక్సిన్!

చైనా శాస్త్రవేత్తలు గుండెపోటు, హార్ట్‌స్ట్రోక్స్ రాకుండా ఓ వ్యాక్సిన్ తయారులో మంచి ఫలితాలు సాధించారు. రక్తంలో కొవ్వు పేరుకుపోకుండా చేసే కాక్‌టేల్‌ తయారు చేసి ఫ్యాట్ ఫుడ్ తినిపించిన ఎలుకలకు ఇచ్చారు. ఈ క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయి.

New Update
heart stroke vaccine

heart stroke vaccine Photograph: (heart stroke vaccine)

ఆకస్మిక మరణాల్లో ఎక్కువగా గుండెపోటు బాధితులే ఉంటారు. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం వల్ల హార్ట్ స్ట్రోక్‌కు దారి తీస్తోంది. గతంలో 50ఏళ్ల పైవారిలో మాత్రమే సంభవించే గుండెపోటు లేదా హార్ట్ స్ట్రోక్ ఇప్పుడు యువత, చిన్నారుల్లో సైతం కనిపిస్తోంది. ఇండియాలో ఇటీవల గుండె హృద్రోగ జబ్బులు బారిన పడిన వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల లేదా బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల వచ్చే ప్రమాదాన్నే అథెరోస్ల్కేరోసిస్ అంటారు. దీని లక్షణాలు అంత సులభంగా గుర్తించలేము. అందుకే హార్ట్‌అటాక్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. 

Also read: Mom sit on son: ఆడుతూ.. ఆడుతూ కొడుకు మీద కూర్చుంది.. బాలుడి ప్రాణం తీసిన తల్లి సరదా

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ విడుదల చేసిన 2025 హార్ట్ డిసీజ్ అండ్ స్ట్రోక్ స్టాటిస్టిక్స్ అప్‌డేట్ ప్రకారం అమెరికాలో గుండె జబ్బులతో అత్యధకంగా మరణిస్తున్నారని వెల్లడించింది. అమెరికాలో ప్రతి 34 సెకన్లకు ఒ-కరు హృదయ సంబంధ వ్యాధులతో మరణిస్తున్నారని సంస్థ వాలంటీర్ అధ్యక్షుడు FAHAలోని MD కీత్ చర్చివెల్ తెలిపారు. గుండెపోటు, స్ట్రోక్‌ను నివారించడానికి వ్యాక్సిన్‌ తయారు చేయాలని ఆయన అన్నారు. వ్యాక్సిన్ మాత్రమే ఈ మరణాలను తగ్గించగలదు.

ఇటీవల చైనా శాస్త్రవేత్తలు ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో రక్తనాళాల్లో కొవ్వు గడ్డకట్టకుండా చూసే ఓ కాక్‌టేల్‌ను కనిపెట్టారు. దీంతో చైనా శాస్త్రవేత్తల్లో గుండె జబ్బులకు వ్యాక్సిన్ డెవలప్‌మెంట్‌పై ఆశలు పెరిగాయి. మా నానోవాక్సిన్ డిజైన్, ప్రీక్లినికల్ డేటా అథెరోస్క్లెరోసిస్‌కు రోగనిరోధక చికిత్సకు పాజిటివ్ రిపోర్ట్స్ అందిస్తున్నాయని చైనాలోని నాన్జింగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ హెల్త్ జర్నల్‌లో రాశారు. వారు వివిధ రకాల ప్రోటీన్లపై ప్రయోగాలు చేస్తున్నారు. చైనా పరిశోధనలో p210 అనే ప్రోటీన్ కనుగొన్నారు. ఇది అథెరోస్క్లెరోసిస్ పెరుగుదలను తగ్గిస్తాయని తేలింది. ఈ ప్రోటీన్‌తో ఓ కాక్‌టేల్ తయారు చేసి ఎలుకలపై క్లినికల్ ట్రయల్స్ చేశారు. ఇది కొత్త వ్యాక్సిన్ కనిపెట్టడంలో కీలక పరిణామంగా మారునుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. p210 యాంటిజెన్‌ను మైక్రోస్కోపిక్ ఐరన్ ఆక్సైడ్ నానోపార్టికల్స్‌కు బంధించడం ద్వారా వ్యాక్సిన్‌గా పనిచేస్తుందని పరిశోధకుల చెబుతున్నారు. 

Also read: girl water fasting: ఆరు నెలలుగా నీళ్లు మాత్రమే తాగిన యువతి మృతి.. ఎందుకంటే..?

అధిక కొలెస్ట్రాల్ ఆహారం తినిపించిన ఎలుకలకు సైంటిస్టులు p210 ప్రోటీన్‌తో తయారు చేసిన కాక్‌టేల్ ఇచ్చారు. అయితే ఇది రక్తంలో కోవ్వు పేరుకుపోడాన్ని నిరోధించిందని అధ్యయనంలో తేలింది. దీంతో మనుషులపై కూడా ఈ వాక్సిన్ సక్సెస్ అవుతుందని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలోనే చైనా దేశం నుంచి హార్ట్ స్ట్రోక్, గుండెపోటుకు వ్యాక్సిన్ రానుంది.

Advertisment
తాజా కథనాలు