BREAKING: సీఎం రేవంత్ ఇలాఖాలో హైటెన్షన్.. ఇంటర్నెట్ బంద్! TG: సీఎం రేవంత్ ఇలాకాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అధికారులపై దాడి ఘటనలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థిని అదుపులో ఉంచేందుకు కొడంగల్, దుద్యాల, బొంరాస్‌పేట్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. By V.J Reddy 12 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి CM Revanth Reddy: సీఎం రేవంత్ ఇలాఖాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అధికారులపై దాడి చేసిన ఘటనలో 50 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అర్థరాత్రి సమయంలో పోలీసులు ఆందోళనకారులను లిఫ్ట్ చేసినట్లు సమాచారం. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు కొడంగల్, దుద్యాల, బొంరాస్‌పేట్ మండలాల్లో ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు. దాడి జరిగిన లగచర్ల గ్రామంలో భారీగా పోలీసుల మోహరించారు. ఫార్మా పరిశ్రమ భూసేకరణ కోసం వెళ్లిన అధికారులపై గ్రామస్థుల దాడి నిన్న దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇది కూడా చదవండిః Dwacra: డ్వాక్రా మహిళలకు తీపి కబురు.. ఆ పథకం కింద రూ.10 లక్షలు! ఎమ్మెల్యే కేటీఆర్ ఆగ్రహం... ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆయన ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ, పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఎక్స్ లో.. "అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు!.. బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు!.. అర్దరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా?.. రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా?.. ఇదేనా ప్రజాస్వామ్య పాలనా?రైతు సంక్షేమ పాలన?.. ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం ! ఇది కూడా చదవండిః ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా ఆయనే..! అర్దరాత్రి అన్నదాతల అరెస్టులు ఎందుకు?.. ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతుల అరెస్టులా?.. మీ అల్లుడు, సోదరుల సంపాదనల కోసం భూమిని నమ్ముకున్న మా పొట్ట కొట్టవద్దన్నందుకు అరెస్టులా?.. రైతుల అరెస్టులను ఖండిస్తున్నాం..పోలీసుల చర్యలను వ్యతిరేకిస్తున్నాం.. లగచర్ల గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నా" అని మండిపడ్డారు. అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు!బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు!అర్దరాత్రి 300మంది పోలీసులను పంపి రైతులను అరెస్ట్ చేస్తారా?రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా?ఇదేనా ప్రజాస్వామ్య పాలనా?రైతు సంక్షేమ పాలన?ఇదేనా వెలుగులను తరిమేసి.. చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం !… — KTR (@KTRBRS) November 12, 2024 ఇది కూడా చదవండిః కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు ఇది కూడా చదవండిః దొంగలతో కానిస్టేబుల్ దోస్తీ.. చివరికి వారిచేతిలోనే హతం, కారణం ఇదే! #farmers #ktr vs revanth reddy #cm-revanth-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి