Ap Assembly: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌‌‌‌గా ఆయనే..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పోస్టుల భర్తీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ పెట్టారు. శాసనసభలో డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ విప్‌ పదవుల్ని భర్తీ చేయబోతోంది.. అలాగే శాసనమండలిలో చీఫ్ విప్, విప్ పదవులపైనా కసరత్తులు మొదలు పెట్టారు.

New Update
BREAKING: ఈ నెల 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Ap Assembly: ఏపీ శాసనసభ, శాసనమండలిలో పదవులకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. శాసనమండలి, శాసనసభల్లో చీఫ్‌ విప్‌ల పేర్లను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శాసనమండలిలో వైసీపీకి బలం ఎక్కువగా ఉండటంతో సమన్వయం కోసం ముందు అక్కడ విప్‌ల నియామకం చేపట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఆ దిశగానే అక్కడ పదవుల భర్తీపై చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 

Also Read:  Varra Ravindra Reddy: వర్రా రవీందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌!

మార్పులు జరిగితే తప్ప...

దాదాపు పేర్లు ఫైనల్ అయ్యాయని తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు జరిగితే తప్ప అవే పేర్లు ఫైనల్ చేసే అవకాశం ఉందనే టాక్‌ నడుస్తుంది. మరోవైపు కీలకమైన శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పదవి భర్తీపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా కాలవ శ్రీనివాసులు పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. అలాగే సభలో చీఫ్‌విప్‌ పదవికి బెందాళం అశోక్, కూన రవికుమార్‌ పేర్లు ప్రతిపాదనలో ఉన్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి ఈ పదవికి పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పేరు పరిశీలనలో ఉన్నా.. గుంటూరు జిల్లాలో అదే సామాజిక వర్గం నుంచి ఇద్దరు రాష్ట్ర మంత్రులు, మరొకరు కేంద్రమంత్రిగా ఉన్నారు. దీంతో ఆయనకు అవకాశం దాదాపు లేనట్లే. 

Also Read:  BC Janardhan Reddy: కుటుంబాన్ని కలవనివ్వకుండా..32 రోజులు నిర్బంధించారు

 శాసనసభలో విప్‌లుగా జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బొమ్మిడి నాయకర్, అరవ శ్రీధర్‌ పేర్లను ఆ పార్టీ అధిష్ఠానం సూచించింది. జనసేన పార్టీ నుంచి మూడో విప్‌గా బొలిశెట్టి శ్రీనివాస్‌ పేరు పరిశీలిస్తున్నట్లు టాక్‌ శాసనమండలిలో చీఫ్‌విప్‌గా టీడీపీ ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ, భూమిరెడ్డి రామ్‌గోపాల్‌రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దర ఎమ్మెల్సీలలో ఒకరు చీఫ్‌ విప్‌ అయితే మరొకరిని విప్‌గా నియమిస్తారని సమాచారం. 

Also Read:  Ayodhya: అయోధ్య పునాదులు పెకిలిస్తాం.. ఖలిస్తానీ ఉగ్రవాది బెదిరింపులు

మరో ఇద్దరు సభ్యులకు విప్‌గా అవకాశం ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఆ రెండింటిలో ఒకటి జనసేన పార్టీకి ఇచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.ఆ పార్టీ నుంచి హరిప్రసాద్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Also Read:  Rains: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం.. నేడు ఈ జిల్లాలలో భారీ వర్షాలు!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు