MLA KTR: మాజీ మంత్రి కేటీఆర్ కు అరెస్ట్ గండం పట్టుకుందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫార్ములా ఈ రేసు నగదు బదిలీ కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేశారని.. ఒక మాజీ మంత్రి, ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి.. కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు గవర్నర్ అనుమతిని ఏసీబీ కోరింది. అయితే గవర్నర్ అనుమతి ఇస్తే కేటీఆర్ ను ఏ క్షణమైన ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
Also Read: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..16 వేల ఉద్యోగాల భర్తీ!
ఇదిలా ఉంటే ఇప్పుడు కేటీఆర్ కు మరో కేసు మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. ఇటీవల లగిచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ తో సహా మిగితా ప్రభుత్వ అధికారులపై జరిగిన దాడి కేసులో ఇప్పటికే కొండంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు నిన్న ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తుంటే అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన ఆయనను ఈ కేసు సంబంధించి కీలక విషయాలను రాబట్టారు పోలీసులు. పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. కేటీఆర్, బీఆర్ఎస్ ముఖ్యనేతల ఆదేశాలతోనే దాడికి వ్యూహరచన చేసినట్లు నరేందర్ రెడ్డి పోలీసులకు వెల్లడించారు.
Also Read: Ap Rains: బలహీన పడిన అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
కేటీఆర్ ఇంటి వద్ద హైటెన్షన్...
కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొడంగల్ దాడి కేసు రిమాండ్ రిపోర్టులో కేటీఆర్ పేరు రావడంతో ఆయనను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జోరుగా సాగింది. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు హైదరాబాద్ లోని కేటీఆర్ నివాసానికి భారీగా తరలి వచ్చారు. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ తదితర పార్టీ ముఖ్యనేతలు కూడా కేటీఆర్ కు మద్దతుగా ఆయన ఇంటికి వచ్చారు.
పోలీసులు ఎప్పుడు వస్తారో తెలియక రాత్రంతా కేటీఆర్ ఇంటి ముందు కాపలా కాస్తూ జాగారం చేశారు. తన కోసం తరలి వచ్చిన నేతలకు, కార్యకర్తలకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిజేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని.. ఇలాంటివి ఉద్యమం సమయంలో చాలా చూశామని కేటీఆర్ అన్నారు. ఈ అరెస్టులకు భయపడే వాళ్ళం కాదని.. ప్రభుత్వం పై ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. కాగా కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారం నిజమవుతుందా? లేదా అనేది వేచి చూడాలి.
Also Read: USA: విజయం తర్వాత మొదటిసారి వైట్ హౌస్‌కు ట్రంప్..బైడెన్‌తో భేటీ
Also Read: స్పెర్మ్ ఇస్తా..ఐవీఎఫ్ చికిత్స కూడా ఉచితం– టెలీగ్రాం సీఈఓ వింత ఆఫర్