స్పెర్మ్ ఇస్తా..ఐవీఎఫ్ చికిత్స కూడా ఉచితం– టెలీగ్రాం సీఈఓ వింత ఆఫర్ తన స్పెర్మ్‌ను దానంగా ఇచ్చి వంద మంది పిల్లలకు తండ్రి అయ్యాడు టెలీగ్రాం సీఈవో పావెల్ దురోవ్. కొన్ని రోజుల క్రితం ఈ విషయం పెద్ద సంచలనమే అయింది. ఇప్పుడు మళ్ళీ తన స్పెర్మ్‌ను ఇస్తా అనడమే కాదు ఐవీఎఫ్ చికిత్సను కూడా ఉచితంగా చేయిస్తా అంటున్నాడు. By Manogna alamuru 13 Nov 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Telegram CEO Pavel Durov: టెలీగ్రా సీఈవో పావెల్ దురోవ్. ఇతనికి పెళ్ళి కాలేదు. స్టిల్ బ్యాచిలర్. కానీ ఇప్పటకే వంద మంది పిలల్లకు తండ్రి అయ్యాడు. తన వీర్యం ద్వారా ఇప్పటివరకే ప్రపంచంలోని ఎన్నో దేశాల్లో 100 మందికి పైగా పిల్లలకు తండ్రి అయ్యారు. కొతం కాలం క్రితం ఇదో పెద్ద సంచలన విసయం అయింది. అయితే దీని వెనుక బలమైన కారణం ఉందని పావెల్ చెప్పారు. 15 ఏళ్ల క్రితం తాను 24 ఏళ్ల వయసులో ఉన్నపుడు.. తన ఫ్రెండ్ చెప్పిన ఒక విషయంతో తాను ఈ వీర్య దానం చేయడం ప్రారంభించినట్లు పావెల్ దురోవ్ చెప్పారు. అయితే తన ఫ్రెండ్‌కు, అతని భార్యకు పిల్లలు పుట్టే అవకాశం లేదని డాక్టర్లు చెప్పారని..అప్పుడే తాను స్పెర్ డోనేట్ చేయాలని నిశ్చయించుకున్నాని తెలిపారు. ఆ తర్వాత వీర్యదానం అనే విషయం చాలా పెద్ద సమస్య అని..ఆరోగ్యకరమైన వీర్యాన్ని దానం చేయడం చాలా అవసరం అని గుర్తించి ఆ పనిని కంటిన్యూ చేశానని చెప్పుకొచ్చారు. Also Read: MH:రాహుల్ బాబా విమానం మళ్ళీ కూలిపోతుంది–అమిత్ షా సంచలన వ్యాఖ్యలు Also Read: Movies: సూర్య కెరీర్‌లోనే అతి పెద్ద సినిమాగా కంగువ..విశేషాలివే.. ఇప్పుడు మళ్ళీ వింత ఆఫర్.. అయితే దీని తర్వా పావెల్ దురోవ్ టెలిగ్రామ్ యాప్ ద్వారా డ్రగ్స్ సరఫరా, చైల్డ్ సెక్సువల్ కంటెంట్, చీటింగ్ వంటి నేరాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై దర్యాప్తు సంస్థలకు సహకరించడంలో ఈ యాప్ విఫలమైందన్న ఆరోపణల కారణంగా అరెస్ట్ అయి...తర్వాత కండిషన్స్‌తో బెయిల్ మీ బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఒక వింత ఆఫర్‌ను తెర మీదకు తీసకువచ్చారు దురోవ్. దీంతో మళ్ళీ ఆయన వైరల్‌గా మారారు. పిల్లలు కావాలనుకునే వారికి తాను స్పెర్మ్‌ను ఇవ్వడమే కాకుండా.. మహిళలకు ఉచితంగా ఐవీఎఫ్ చికిత్స అందిస్తానని హామీ ఇస్తానని ప్రకటించారు. దీని కోసం ఆల్ట్రావిటా ఫెర్టిలిటీ క్లినిక్‌తో దురోవ్ ఒప్పందం కుదుర్యుకున్నారని తెలుస్తోంది. మా క్లినిక్‌లో పావెల్ దురోవ్ వీర్యకణాలు ఉపయోగించుకొని ఉచితంగా ఐవీఎఫ్ (IVF) చికిత్స పొందొచ్చు అని అల్ట్రావిటా తన వెబ్‌సైట్‌లో నౌన్స్ చేయడంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. టెలిగ్రామ్ సీఈఓను అత్యంత విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఆ పోట్‌లో అల్ట్రావిటీ చెప్పింది. ఈ ప్రక్రియలో భాగంగా మెరుగైన ఫలితాలు పొందేందుకు అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తామని తెలిపింది. రష్యా రాజధాని మాస్కోలో ఈ ఆల్ట్రావిటా క్లినిక్ ఉంది. Also Read: KTR Arrest: బిగుస్తున్న ఉచ్చు.. ఏ క్షణమైన కేటీఆర్ అరెస్ట్! Also Read : త్వరలో ముగియనున్న ధరణి కథ.. రేవంత్ సర్కార్ కొత్త వ్యూహం ఇదే! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి