Nara Lokesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..16 వేల ఉద్యోగాల భర్తీ! 16 వేల పైచిలుకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. By Bhavana 14 Nov 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Ap: ఏపీలోని నిరుద్యోగ యువతకు ఏపీ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది.16 వేల ఉద్యోగాల భర్తీపై బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఓ కీలక ప్రకటన చేశారు. 16 వేల పై చిలుకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు నారా లోకేష్ ఈ మేరకు జవాబు ఇచ్చారు. Also Read: Ap Rains: బలహీన పడిన అల్పపీడనం..నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు! 11 డీఎస్సీలు ప్రకటించి.. ఏపీ చరిత్రలో 11 డీఎస్సీలు ప్రకటించి.. ఒకటిన్నర లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే అని నారా లోకేష్.. చంద్రబాబు హయాంలోనే 9 డీఎస్సీలు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కూడా టీడీపీ కూటమి సర్కారు అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే తొలి సంతకం చేసినట్లు తెలిపారు. Also Read: USA: విజయం తర్వాత మొదటిసారి వైట్ హౌస్‌కు ట్రంప్..బైడెన్‌తో భేటీ నిరుద్యోగ యువత తరుఫున పోరాటం కారణంగానే ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి 93 శాతం విజయాన్ని అందించారని నారా లోకేష్.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఉద్యోగాల కల్పనకు నియమించిన కేబినెట్ సబ్ కమిటీకి తనను ఛైర్మన్‌ను చేశారన్న నారా లోకేష్. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు అందించడమే లక్ష్యంగా పెట్టుబడుల ఆకర్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. Also Read: MH:రాహుల్ బాబా విమానం మళ్ళీ కూలిపోతుంది–అమిత్ షా సంచలన వ్యాఖ్యలు మరోవైపు ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్రంలోకి పెట్టుబడులు వచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఏపీ ప్రభుత్వం చర్యల కారణంగా ఇప్పటికే విశాఖపట్నంలో టీసీఎస్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్ ముందుకు వచ్చినట్లు లోకేష్ ఇంతకుముందే తెలిపిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం కారణంగా పదివేల మందికి ఉద్యోగాలు దొరకనున్నాయి. Also Read: స్పెర్మ్ ఇస్తా..ఐవీఎఫ్ చికిత్స కూడా ఉచితం– టెలీగ్రాం సీఈఓ వింత ఆఫర్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ సైతం ఏపీ ప్రభుత్వంతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రిలయన్స్ 65 వేలకోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీంతో రెండున్నర లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే బీపీసీఎల్, లులూ గ్రూప్ వంటి సంస్థలు కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. #ap-dsc-notification #ap-jobs #nara-lokesh #nara lokesh on dsc notification మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి