Dilawarpur : తెలంగాణలో ఇటీవల జరిగిన లగచర్ల ఘటన మరువకముందే అలాంటి మరో సంఘటన వేరే జిల్లాలో రగుల్చుకుంది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. కాగా తమకు ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అంటూ గత కొన్ని నెలలుగా ఆందోళన చేస్తున్నారు. మొత్తం నాలుగు గ్రామాల ప్రజలు ఆ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. తాజాగా ఆందోళనలను ఉదృతం చేశారు. కాగా నిన్నమధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్డీవో రత్న కళ్యాణి వచ్చి ఆందోళన విరమించాలని రైతులను కోరగా.. ఆమెను దాదాపు ఆరు గంటలు పైగా రైతులు నిర్బంధించారు.
Also Read: AP: ప్రభుత్వ ఉద్యోగులకు చంద్రబాబు అదిరిపోయే శుభవార్త!
ఆర్డీవో కారుకు నిప్పు...
128 రోజులుగా చేస్తున్న తమ ఉద్యమానికి మద్దతు తెలిపిన విజయ్ కుమార్ అనే ప్రధానోపాధ్యాయుడును సస్పెండ్ చేయగా అయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించమని రైతులు భీష్మించుకుని ఉండగా వెళ్లిపోవాలని ప్రయత్నించిన ఆర్డీవో రత్న కళ్యాణిని అడ్డుకున్నారు. ఒకానొక సందర్భంలో ఆమె బీపీతో అస్వస్థతకు గురి కాగా భారీ పోలీసు బందోబస్తు నడుమ జిల్లా ఎస్పీ ఆమెను రక్షించేందుకు యత్నించగా మహిళలు దాడి చేయబోయారు.. అనంతరం ఆమెను ఎస్పీ తన కారులో ఆసుపత్రికి తరలించారు. ఆర్డీవో వెళ్లిపోయిన తరువాత ఆందోళనకారులు ఆమె కారు మీద దాడి చేసి ఎత్తి పక్కన పడేశారు. ఆమె కారు మీద దాడి చేసి నిప్పు అంటించారు. ఈ నిప్పుల దాడిలో మహిళా ఎస్సై గాయపడ్డారు.
Also Read: TG: మూసీ నిర్వాసితులకు హైకోర్ట్ బిగ్ షాక్..కూల్చివేతలకు గ్రీన్ సిగ్నల్
144 సెక్షన్ అమలు...
దిలావర్‌పూర్‌లో పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉంచారు. రైతులను, నిరసనకారులను పోలీసులు అరెస్టు చేయడంతో గ్రామస్థులు తీవ్రంగా ఆగ్రహించారు. దీంతో గ్రామస్థులంతా మూకుమ్మడిగా ఇళ్లలో నుంచి బయటకు వచ్చి రోడ్లపై నిరసన తెలిపారు. గ్రామంలోని ప్రధాన కూడలిలా వద్ద పోలీసు బలగాలు పహార కాస్తున్న లెక్క చేయకుండా వందల సంఖ్యలో గ్రామస్థులు ర్యాలీగా రోడ్ల పైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అదే సమయంలో అక్కడి వచ్చిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్ళూ రువ్వారు. దీంతో అక్కడ మరోసారి ఉద్రిక్తత నెలకొంది.