Pawan: పిఠాపురంలో నాలుగు ప్రధాన రైళ్లు..రైల్వే మంత్రితో పవన్ భేటీ!

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తో భేటీ అయ్యారు. పిఠాపురం పరిధిలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని.. నాలుగు ముఖ్మమైన రైళ్లకు పిఠాపురం రైల్వే స్టేషన్‌లో హాల్ట్ ఇవ్వాలని కోరారు.

author-image
By Bhavana
New Update
minister

Pawan Kalyan : ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. హస్తినలో ఫుల్‌ బిజీగా గడిపారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతూ.. రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలోనే రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలోని రైల్వే ప్రాజెక్టులపై మాట్లాడారు. అలాగే పిఠాపురం పరిధిలోని రైల్వే పనుల గురించి పవన్ కళ్యాణ్.. కేంద్ర మంత్రికి కొన్ని విజ్ఞప్తులు చేశారు. 

Also Read: Chhattisgarh: 17 ఏళ్ళ బాలికపై అత్యాచారం..నలుగురు ఉపాధ్యాయులు అరెస్ట్

పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని సామర్లకోట – ఉప్పాడ రోడ్డులో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని ఆయన మంత్రిని కోరారు. ఈ రోడ్డులో వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉన్నయాని కేంద్ర మంత్రికి పవన్‌ వివరించారు. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి, రోడ్‌ కనెక్టివిటీని మెరుగుపరచడానికి రైల్వే ఓవర్ బ్రిడ్జి అవసరమని పవన్‌ అన్నారు.

Also Read: Israel: సంధి గురించి మాటలు ఒకవైపు ..భీకర దాడులు మరోవైపు

పిఠాపురంలో నాలు రైళ్లు...

ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి గతి శక్తి కార్యక్రమం ద్వారా ఇవ్వాలని పవన్‌ కోరారు.అలాగే పిఠాపురంలోని శ్రీపాద వల్లభ స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారని రైల్వే శాఖ మంత్రికి తెలిపిన పవన్.. భక్తులకు వీలుగా ఉండేలా నాలుగు ముఖ్యమైన రైళ్ళకు పిఠాపురం రైల్వే స్టేషన్‌లో హాల్ట్ ఇవ్వాలని కోరారు. నాందేడ్ - విశాఖపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం- సాయినగర్ షిర్డీ ఎక్స్‌‌ప్రెస్, విశాఖపట్నం- న్యూఢిల్లీనాందేడ్ - సంబల్పూర్ నాగావళి ఎక్స్‌ప్రెస్,  ఏపీ ఎక్స్‌ప్రెస్‌లకు పిఠాపురంలో హాల్ట్ ఇవ్వాలని కోరారు. అలాగే మహారాష్ట్ర లాతూర్ నుంచి తిరుపతికి రైలు ఏర్పాటు చేయాలని మంత్రిని పవన్‌ అడిగారు.

Also Read: Pakistan: ఇస్లామాబాద్‌లో రణరంగం...ఇమ్రాన్‌ ను రిలీజ్ చేయాలంటూ గొడవ

పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలపై కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం .మరోవైపు ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా పవన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత రహదారుల అభివృద్ధికి రుణాల్లో వెసలుబాటు కావాలని ఆయన మంత్రిని కోరారు.

Also Read: AP : తీవ్ర వాయుగుండం..ఏపీకి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్‌!

 అలాగే రుణ ఒప్పందంలో పేర్కొన్న ప్రకారం రీయింబర్స్‌మెంట్‌ పద్దతిలో కాకుండా ముందస్తు చెల్లింపు పద్ధతిలో కొనసాగించాలని అడిగారు. అలాగే ప్రస్తుతం ఉన్న నిధుల కేటాయింపులోనూ మార్పులు చేయాలని కోరారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు