/rtv/media/media_files/2025/04/10/s89TzYNPdyo6iR42Pnm0.jpg)
High Security number plate
New Vehicle Rules: మీ వెహికల్ 2019 ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందు తయారైందా...అయితే అర్జంటుగా వెళ్ళి నంబర్ ప్లేట్(Number Plate) మార్చుకోండి. పై తేదీ కన్నా ముందు తయారైన వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ బిగించుకోవాల్సిందేనని తెలంగాణ రవాణాశాఖ చెప్పింది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. వాహన రకాన్ని బట్టి నంబర్ ప్లేట్‌కు కనిష్ఠంగా రూ.320.. గరిష్ఠంగా రూ.800గా ఛార్జీలను ఖరారు చేసింది. నకిలీ నంబర్ ప్లేట్లకు అడ్డుకట్ట వేయడం, దొంగతనాలను అరికట్టడం, వాహనాలు రహదారి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేస్తున్నామని రవాణాశాఖ చెబుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
కచ్చితంగా మార్చాల్సిందే..
పాత వాహనాలకు నంబర్ ప్లేట్ మార్చాల్సి బాధ్యత యజమానిదే అని తేల్చి చెప్పింది రవాణాశాఖ. హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ మార్చుకోకపోతే వాహనాలను అమ్మాలన్నీ, కొనాలన్నా సాధ్యం కాదని తెలిపింది. అలాగే బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్ లాంటివి కూడా లభించవు. పైగా సెప్టెంబర్ తర్వాత కొత్త నంబర్ ప్లేట్లు కనిపించకపోతే కేసులు కూడా నమోదు చేయనున్నారు. ఇక ఈ నంబర్ ప్లేట్లు వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల దగ్గర కూడా చేయించుకోవచ్చును. దీనికి సంబంధించిన సమాచారం, నంబర్ ప్లేట్ ధరలు డీలర్ దగ్గర కనిపిచేలా చేయనున్నారు. వాహనదారులు ఈ ప్లేట్ కోసం www.siam.in వెబ్‌సైట్‌లో ..వాహన వివరాలు నమోదు చేసి బుక్ చేసుకోవాలి. కొత్త ప్లేట్ బిగించాక ఆ ఫొటోను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
today-latest-news-in-telugu | telangana | number-plates | vehicles
Also Read: USA: వెనక్కు తగ్గిన ట్రంప్ సర్కార్, చైనా తప్ప మిగతా దేశాలపై 90 రోజుల పాటూ..
Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో