అధికారులు నిద్రపోతున్నారా ? మగనూరు ఘటనపై హైకోర్టు ఆగ్రహం నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అధికారులు నిద్రపోతున్నారా ? అంటూ ధ్వజమెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదంటూ మండిపడింది. By B Aravind 27 Nov 2024 in తెలంగాణ Latest News In Telugu New Update షేర్ చేయండి నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్‌లో ఫుడ్ పాయిజన్ కావడంతో 50 విద్యార్థులు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు నిద్రపోతున్నారా అంటూ ధ్వజమెత్తింది. పాఠశాలలో ఫుడ్ పాయిజన్ చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ పాటించడం లేదని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. Also Read: వివాదాస్పద ఇథనాల్ పరిశ్రమ రద్దు.. సర్కార్ సంచలన నిర్ణయం? పిటిషినర్ తరఫున సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ తన వాదనలు వినిపించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తరచుగా భోజనం వికటిస్తోందని కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. వారంలో మూడుసార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పిల్లలు చనిపోతే తప్ప స్పందిచరా అంటూ మండిపడింది. అధికారుల నిర్లక్ష్యానికి ఇదొక నిదర్శనం అంటూ మొట్టికాయలు వేసింది. అలాగే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకోవడం లేదని ఫైర్ అయ్యింది. వారం రోజుల్లో కౌంటర్ వేస్తామన్న ప్రభుత్వ న్యాయవాదిపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించేందుకు వారం రోజుల సమయం ఎందుకంటూ ప్రశ్నించింది. హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా అంటూ మండిపడింది. వాళ్లకి కూడా పిల్లలు ఉంటారు కదా, మానవతా ధృక్పథంతో వ్యవహరించాలంటూ హితువు పలికింది. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారంటూ పేర్కొంది. తదుపరి విచారణను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. Also Read: హైదరాబాద్‌లో కలకలం.. ఒకే రోజు మూడు చోట్ల. ఇదిలాఉండగా.. ఇటీవల మాగనూర్ హైస్కూల్‌లో మధ్నాహ్న భోజనంలో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఆ తర్వాత అదే పాఠశాలలో మళ్లీ 29 మంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. మంగళవారం మధ్నాహ్న భోజనం తిన్న విద్యార్థులు తమ ఇళ్లకు తిరిగి వెళ్తున్న సమయంలో వాంతులు చేసుకున్నారు. దీంతో ఉపాధ్యాయులు వారిని స్థానికి పీహెచ్‌సీకి తరలించి చికిత్స చేయించారు. 29 మందిలో ఏడుగురు కోలుకోగా.. మిగిలిన 22 మందిని మక్కల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. Also Read: పుష్ప ఐటెం సాంగ్ కు బ్రహ్మానందం, అలీ, సునీల్ డ్యాన్స్.. వీడియో వైరల్! Also Read: నేను భయపడే రకం కాదు–ఆర్జీవీ #food-poison #govt-schools #telugu-news #telangana-news #telangana-high-court మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి