RGV: నేను భయపడే రకం కాదు–ఆర్జీవీ

నా మీద పెట్టిన కేసులకు నేనే వణికిపోవడం లేదంటూ ఆర్జీవీ ఓ వీడియో రిలీజ్ చేశారు.  ఏడాది కింద నేను పెట్టిన ట్వీట్లకు ఇప్పుడు మనోభావాలు దెబ్బ తినడం ఏంటంటూ ఆయన తనదైన స్టైల్‌లో వీడియోలో మాట్లాడారు. 

author-image
By Manogna alamuru
New Update
0

నేను ఏదో ట్వీట్ పెట్టాను. ఎవరి గురించో పోస్ట్ రాశాను. అయితే వాళ్ళకు కాకుండా ఎవరో థర్డ్ పార్టీకి ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంట...అసలు దీనికి ఏమైనా అర్ధం ఉందా అంటూ ఆర్జీవీ కౌంటర్ అటాక్ చేశారు. తనమీద పెట్టిన కేసులకు తానేమీ భయపడడం లేదని చెప్పారు. ఏడాది కింద పెట్టిన ట్వీట్స్‌కు ఇప్పుడు మనోభావాలు దెబ్బ తినడం ఏంటని ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించారు.

నా కేసే ఇప్పుడు అర్జంట్ అయిపోయింది..

దేశంలో మర్డర్లు, మానభంగాల మీద ఏళ్ళకు ఏళ్ళు కేసులు నడిపిస్తారు. నా ఈ ట్వీట్ కు మాత్రం వెంటనే  కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు ఆర్జీవీ. అసలు మనోభావాలకు ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం తాను  ఓ సినిమా షూటింగ్‌లో ఉన్నానని...అక్కడి నుంచి వచ్చేస్తే నిర్మాతకు నష్టం అని చెప్పారు. అందుకే తాను విచారణకు హాజరుకాలేకపోతున్నాని అన్నారు. 

Also Read: Israel: సంధి గురించి మాటలు ఒకవైపు ..భీకర దాడులు మరోవైపు

Advertisment
తాజా కథనాలు