Kissik Song Memes
Kissik Song Memes: ఈ మధ్య సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ బాగా పెరిగిపోయింది. ఏదైనా ఒక ఆసక్తికర ఫొటో, వీడియో, సినిమా ట్రైలర్, సాంగ్ దొరికిందంటే దాన్ని మీమ్ మెటిరీయల్‌గా మార్చేయడం మీమర్స్ స్పెషాలిటీ. 90's హీరోల డాన్స్ స్టెప్పులను ట్రెండింగ్ పాటలకు యాడ్ చేసి ఎడిట్లు చేస్తుంటారు. ఇవి చూడడానికి భలే సరదాగా కనిపిస్తాయి. ప్రస్తుతం పుష్ప2 నుంచి విడుదలైన కిస్సిక్ సాంగ్ పై కూడా ఇలాంటి మీమ్ ఒకటి చేశారు మన మీమర్స్.
Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?
కిస్సిక్ పాటలో బ్రహ్మి, ఆలీ, సునీల్
అల్లు అర్జున్ పుష్ప2 నుంచి ఆదివారం స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ అయ్యింది. అయితే ఈ సాంగ్ పై మీమర్స్ తమ క్రియేటివిటీని చూపించారు. స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, అలీ, సునీల్ కి సంబంధించిన పలు కామెడీ సీన్లను ఈ పాటలోని లిరిక్స్ కి జోడించి మీమ్ చేశారు. ఈ మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇందులో సునీల్, అలీ, బ్రహ్మానందం ఎక్స్ ప్రెషన్స్ పాట మ్యూజిక్ తో బాగా సింక్ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు.. 'ఎంతకు తెగించార్రా' అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు సూపర్ ఎడిట్ బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు. బ్రహ్మానందం ఎమోజీస్, డైలాగ్స్, స్టిల్స్ తో చేసే ప్రతీ మీమ్స్ నెట్టింట తెగ వైరల్ అవుతుంటోంది.
Orei 🤣🤣🤣🤣🤣🤣🤣
— Hemanth Kiara (@ursHemanthRKO) November 26, 2024
Excellent Edit on #Kissik #Pushpa2TheRule pic.twitter.com/tIuZmzMV9Z
ఇది ఇలా ఉంటే.. పుష్ప2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఏకంగా 1000 పైగా థియేటర్లలో పుష్ప 2 రిలీజ్ కానున్నట్లు సమాచారం. దీంతో ఇప్పటివరకు ఇండియన్ సినిమాలోనే పుష్ప బిగ్గెస్ట్ రిలీజ్ కానుంది.
Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!
ఇది కూడా చూడండి: Ajahn Siripanyo: బౌద్ధ సన్యాసిగా మారిన 40 వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు