బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ సిటిజన్‌షిప్ కేసులో కోర్టులో తీర్పు చెప్పింది. చెన్నమనేని రమేష్ సిటిజన్ షిప్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది. రూ.30 లక్షల ఫైన్ విధించింది. దాదాపు 10 సంవత్సరాలు ఈ కేసు హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. జర్మనీ సిటిజన్‌షిప్‌తో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారంటూ అపోసిషన్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆది శ్రీనివాస్ పై చెన్నమనేని రమేష్ టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు.
Also Read: ఆడపిల్ల పుట్టిందని ఊరంతా చీరలు పంచిన తండ్రి
ఇది కూడా చదవండి : తెలంగాణ తల్లి విగ్రహ ప్రత్యేకత ఇదే.. అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి
చెన్నమనేని రమేష్ ఎన్నిక చెల్లదంటూ ఆది శ్రీనివాస్ పిటిషన్ కోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి కోర్టులో ఈ కేసు నడుస్తూనే ఉంది. డిసెంబర్ 9న తెలంగాణ హైకోర్టు చెన్నమనేని ఎన్నిక చెల్లదంటూ ఈ కేసులో ఫైనల్ తీర్పు ఇచ్చింది. రూ.25 లక్షలు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. మరో రూ.5 లక్షలు హైకోర్టు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది.
Also Read: అసెంబ్లీ దగ్గర గందరగోళం.. BRS MLAలు అరెస్ట్, ట్రాక్టర్‌పై BJP MLAలు
విచారణ సందర్భంగా కోర్టును తప్పుదోవ పట్టించారంటూ చెన్నమనేని రమేష్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు సమాచారం, ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చారంటూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. నెల రోజుల్లో జరిమానా మొత్తం చెల్లించాలని ఆదేశించింది.
Also Read: రాచరిక పాలనలో అసలైన తెలంగాణ చరిత్ర మరుగునపడింది.. పొన్నం ఫైర్