రాచరిక పాలనలో అసలైన తెలంగాణ చరిత్ర మరుగునపడింది.. పొన్నం ఫైర్

పదేళ్ల రాచరిక పాలనలో అసలైన తెలంగాణ చరిత్ర మరుగునపడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అనేక మంది ప్రజలు, కళాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని శాసన సభలో తెలంగాణ తల్లిపై జరిగిన చర్చలో మండిపడ్డారు.

author-image
By srinivas
New Update
Ponnam Prabhakar

TG News: పదేళ్ల రాచరిక పాలనలో అసలైన తెలంగాణ చరిత్ర మరుగునపడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శాసన సభలో తెలంగాణ తల్లిపై జరిగిన చర్చలో రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అనేక మంది ప్రజలు, కళాకారులు నిర్లక్ష్యానికి గురయ్యారని మండిపడ్డారు.

వ్యక్తికి, కుటుంబానికి పరిమితం కాదు..

ఈ మేరకు సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రాకపోతుండేనని చెప్పార. డిసెంబర్ 9 న తెలంగాణా ఏర్పాటు ప్రకటించిన సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చిహ్నం చర్చ జరుగుతుంది.  తెలంగాణకు అధికారిక గేయం లేదు. తెలంగాణ సెంటిమెంట్ కి అనుగుణంగా మా ప్రభుత్వం రాగానే  తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం గీతాన్ని అధికారికంగా ఏర్పాటు చేశాం. తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ అధికారికంగా లేదు. అది ఒక పార్టీకి సంబంధించిన అప్లికెటెడ్ తప్ప రాష్ట్ర అధికారిక విగ్రహం కాదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని డా. బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో ఆవిష్కరించుకుంటున్నం. తెలంగాణకు స్ఫూర్తి దాయకంగా ఉండాలని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసుకుంటున్నాం. వ్యక్తికి, కుటుంబానికి పరిమితం కాదు తెలంగాణ తల్లి. గత 10 ఏళ్ల పాలనలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు అధికారికంగా ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.

డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం..

ప్రతి జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్, పోలీస్ కార్యాలయాల్లో, ప్రభుత్వం కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు.  ప్రతి సంవత్సరం డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందామని పిలుపునిచ్చారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయలేదన్నారు. గత 10 సంవత్సరాలుగా ఉద్యోగులను ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగ నాయకులను పదవి విరమణ కాగానే వారికి పదవులు ఇస్తే వారు అనుకూలంగా ఉంటారేమో. కానీ మా ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడానికి దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, తాను ఒక కమిటీ వేసి ఒక నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

ఇది కూడా చదవండి: 46 వయసులో కోయాక్టర్ ను పెళ్లి చేసుకున్న హీరో.. ఫొటోలు వైరల్!

ఖమ్మం జిల్లా వరదలతో చాలా ప్రాంతాలు మునిగి 10 వేల కోట్ల నష్టం జరిగితే  ముష్టి 400 కోట్లు ఇచ్చాం. రాజకీయాలకు అతీతంగా నిధులు తెచ్చుకునే విషయంలో ఉండాలి. ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ తల్లి సేవ చేసుకోవాలి. తెలంగాణ తల్లి రాచరికపు పాలన లేకుండా ఒకవైపు అభయ హస్తం మరోవైపు పచ్చని పాడి పంటలు పచ్చదనం అభివృద్ధికి నిదర్శనంగా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాం.
కిరీటాలు లేకుండా గ్రామాల్లో కనిపించే గ్రామ వనితలాగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉండేలా విగ్రహ ఏర్పాటు ఉంటుంది. తెలంగాణ ఆత్మగౌరవం వచ్చినప్పుడు హక్కు గా భావించవద్దన్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు