/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-22T162538.691.jpg)
TGPSC – Telangana State Public Service Commission
TG High Court : గ్రూప్-1 నియామకాల విషయంలో టీజీపీఎస్సీకి తెలంగాణ హైకోర్టు బిగ్‌షాకిచ్చింది.గ్రూప్ 1 పరీక్ష పై అప్పీల్ చేసిన పిటిషన్‌పై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన మద్యంతర ఉత్తర్వులపై టీజీపీఎస్సీ (TGPSC) సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఆ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులను రద్దు చేయాలని టీజీపీఎస్సీ తరఫున న్యాయవాది కోర్టును కోరగా దీనికి సీజే ధర్మాసనం నిరాకరించింది.
ఇది కూడా చూడండి: Akshaya Tritiya 2025 నేడు అక్షయ తృతీయ.. బీరువాలో ఈ ఒక్కటి ఉంచితే డబ్బులే డబ్బులు
గ్రూప్- 1 నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగా చేయలేదని, పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్ నామవరపు రాజశ్వరరావు ధర్మాసనం నియామకాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ధ్రువపత్రాల పరిశీలన మాత్రం చేసుకోవచ్చని అవకాశం కల్పించారు.
ఇది కూడా చూడండి: DC VS KKR: డూ ఆర్ డై మ్యాచ్ లో ఢిల్లీ ఓటమి..14 పరుగుల తేడాతో కోలకత్తా విజయం
ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిటిషన్ దాఖలు చేయగా దీనిపై ఇవాళ సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ బెంచ్ లో విచారణ ఉన్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. అలాగే మధ్యంతర ఉత్తర్వులను పునఃసమీక్షించాలని సింగిల్ బెంచ్ జడ్జికి ఆదేశించింది.సింగిల్ బెంచ్ మళ్ళీ విచారణ జరపాలని డివిజన్ బెంచ్ ఆదేశాలిచ్చింది. వేసవి సెలవులకు ముందే గ్రూప్ 1 వివాదంఫై తుది ఆదేశాలు ఇవ్వాలని సింగిల్ బెంచ్‌కు హైకోర్టు డివిజన్ బెంచ్ సూచించింది.
Also Read: పాకిస్థాన్‌కు షాక్.. ఇజ్రాయెల్ సాయంతో భారత్ సరికొత్త ప్లాన్ !