Rain alert : హైదరాబాద్ లో భారీ వర్షం...దంచికొడుతున్న వాన

తెలంగాణలో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతోంది. ఈ రోజు ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా ఛేంజ్‌ అయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

New Update
Heavy rain in Hyderabad

Heavy rain in Hyderabad

Rain alert : తెలంగాణలో వాతావరణం ఎప్పటికప్పుడు మారుతోంది. ఈ రోజు ఉదయం నుంచి ఎండలు దంచికొట్టగా సాయంత్రానికి వాతావరణం ఒక్కసారిగా ఛేంజ్‌ అయింది. ఒక్కసారిగా మబ్బులు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. తూర్పు, ఉత్తర ప్రాంతాలు మల్కాజ్ గిరి, తార్నాక, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసింది. కోర్ సిటీలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కాబట్టి నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు నగరంలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వర్షం షురూ అయ్యింది.ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, రంగారెడ్డి, సిరిసిల్లలో తీవ్రమైన తుఫానులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.  

Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?

Heavy Rain In Hyderabad

మరోవైపు రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు పడనున్నాయి. బంగాళాఖాతంలో ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం పూట ఎండలు దంచికొట్టినప్పటికీ సాయంత్రం వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. ఈదురుగాలులతో కూడిన వర్షం పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.  

Also Read: రాజాసాబ్ ఇటలీ లోనే ఉంటాడా..? ఫ్యాన్స్‎లో టెన్షన్ టెన్షన్..!

ముఖ్యంగా ఖమ్మం, మహబూబాబాద్ నల్లగొండ, వరంగల్, జనగాం, సూర్యాపేట, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తమంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు అకాల వర్షాలకు రైతులు అల్లాడిపోతున్నారు.చేతికి రాకముందే వర్షానికి దెబ్బతినడంతో రైతులు బాధ వర్ణణాతీతమనే చెప్పుకోవాలి. ఈదురుగాలలు, ఉరుములు, మెరుపులతో పాటు వడగళ్ల వర్షంతో పంటలకు అపారనష్టం వాటిల్లింది.

Also Read: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!

 

heavy-rains-in-telangana | rains-in-telangana | hyderabad rains today | hyderabad-rain | hyderabad-rains | rain-alert

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు