Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. భారీ వర్షాలు

వచ్చే 14 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి తదితర జిల్లాలతో పాటు కోస్తాంధ్రాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

New Update

తెలుగు రాష్ట్రాల్లో  భారీ వర్షాలు కురవనున్నాయి. వచ్చే 14 గంటల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాల కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.  అలాగే కోస్తాంధ్రాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని చెప్పింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

Also Read: ఎంత మూర్కుడివిరా నీవు....భార్యను బాల్కనీ రెయిలింగ్‌కు వేలాడదీసిన భర్త

గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల వీస్తాయని తెలిపింది. మరోవైపు ఇప్పటికే నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్నాయి. ఇప్పటికే రైతులు వ్యవసాయ పనుల్లో మునిగిపోయారు. ఇదిలాఉండగా.. ఈ ఏడాది మే 24న నైరుతి రుతుపవనాలు కేరళకు ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఈసారి దాదాపు వారం రోజుల ముందుగానే నైరుతి ప్రవేశించింది. 

Advertisment
తాజా కథనాలు