Telangana: తండ్రి లేకపోయినా ఫర్వలేదు..మైనర్‌ కి పాస్‌పోర్టు ఇవ్వొచ్చు!

వివాహ బంధం రద్దు అయిన తరువాత మైనర్‌ పిల్లలకు పాస్‌పోర్టు జారీలో తల్లిదండ్రులిద్దరి సంతకం అవసరంలేదని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది.మైనర్‌ పిల్లల కస్టడీ ప్రత్యేకంగా ఉన్నప్పుడు మరొకరి సంతకం అవసరం లేదని తేల్చిచెప్పింది.

New Update
TG HIGH COURT

Telangana: వివాహ బంధం రద్దు అయిన తరువాత మైనర్‌ పిల్లలకు పాస్‌పోర్టు జారీలో తల్లిదండ్రులిద్దరి సంతకం అవసరంలేదని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది.మైనర్‌ పిల్లల కస్టడీ ప్రత్యేకంగా ఉన్నప్పుడు మరొకరి సంతకం అవసరం లేదని తేల్్చి చెప్పింది. దీనికి సంబంధించి చట్టంలో ఎలాంటి నిషేధం లేదని తెలిపింది.

Also Read: Weather: రుతుపవనాల సీజన్‌ లో అల్పపీడనాలు..ఎందుకింత తీవ్రం!

తండ్రి సంతకం లేకుండా పాస్‌పోర్టు జారీ చేయకపోవడాన్ని సవాలు చేస్తూ 4ఏళ్ల జైనాబ్‌ అలియా మహ్మద్ అనే బాలిక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.దీని పై జస్టిస్‌ మౌసమీ భట్టాచార్య ఇటీవల విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరుఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..పిటిషనర్‌ తల్లి డాక్టర్‌ సనా ఫాతిమా భర్త అబ్దుల్‌ ఖదీర్‌ కు అమెరికా పౌరసత్వం ఉంది.

Also Read: TS: నాగార్జునాసాగర్ దగ్గర హై డ్రామా..భద్రత విషయంలో గందరగోళం

ప్రస్తుతం ముస్లిం చట్టం ప్రకారం వివాహం రద్దయింది.హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌ లో ఉంది.కుమార్తె జైనాబ్‌ అలియా మహ్మద్‌ పాస్‌పోర్టు నిమిత్తం ఆమె దరఖాస్తు చేస్తే అమెరికాలో ఉన్నతండ్రి సంతకం కావాలంటూ పాస్‌పోర్టు అధికారులు సెప్టెంబర్‌ 10న దరఖాస్తు తిరస్కరించారని వివరించారు.

Also Read: KTR: కేటీఆర్ కోసం పాట పాడిన కొడుకు..ఉత్తమ బహుమతి అంటూ ఎమోషనల్

కేంద్రం తరుఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ విదేశీ పౌరసత్వం ఉన్న,భారతీయ పౌరసత్వం వదులుకున్న తల్లిదండ్రులు పిల్లలు పాస్‌పోర్టు పొందడానికి నిబంధనలు కట్టుబడి ఉండాలన్నారు. వాదనలు విన్నన్యాయమూర్తి మైనర్‌ పిల్లలకు సింగిల్‌ పేరెంట్‌ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేయరాదంటూ1967 పాస్‌పోర్టు చట్టం, 1980 నిబంధనల్లో ఎక్కడా లేదన్నారు.

Also Read: Madhya Pradesh: రామాలయంలో భారీ అగ్నిప్రమాదం.. కాలిపోయిన విగ్రహాలు

మైనర్‌ పిల్లల ప్రత్యేక కస్టడీ ఉన్నప్పుడు సింగిల్‌ పేరెంట్‌ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మైనర్‌ పిల్లల పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోకుండా నిరోధించడం తల్లిదండ్రులతో పాటు పిల్లల  హక్కులకు విరుద్దమన్నారు. 

Advertisment
Advertisment