Harish Rao: రైతుబంధును తీసేయాలని కుట్ర చేస్తున్నారు.. హరీశ్‌రావు ఫైర్

తమ ప్రభుత్వం రైతన్నకు కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. ఈ యాసంగి, వచ్చే వానాకాలానికి రైతుభరోసా కలిపి ఎకరాకు రూ.15 వేలు ఇవ్వకుండా మొండి చేయి చూపారంటూ విమర్శించారు.

author-image
By B Aravind
New Update
HARISH RAOO

రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సే హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం రైతన్నకు కల్పించిన రైతు బంధు పథకాన్ని శాశ్వతంగా లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. మహబూబ్‌నగర్‌ రైతు పండుగలో రేవంత్‌ సహా ఇతర మంత్రులు గొంతు చించుకొని మాట్లాడిన అది దండగే అయ్యిందంటూ సెటైర్లు వేశారు. '' ఏడాది పూర్తయిన సందర్భంగా రైతులందరికీ రుణమాఫీ, ఈ యాసంగి, అలాగే వచ్చే వానాకాలని రైతు భరోసా మొత్తం కలిపి ఎకరాకు రూ.15 వేలు ప్రకటిస్తారని అనుకుంటే మొండి చేయి చూపారు.

Also Read: తీరాన్ని తాకిన తుపాను..జిల్లాలకు అధికారుల హెచ్చరికలు

Harish Rao - Revanth Reddy

కాళేశ్వరం ప్రాజెక్టుతో కాకుండా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లే 1.53 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిందంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ చెప్పిన ప్రాజెక్టుల 2014లో కూడా ఉన్నాయి. మరి అప్పుడు కేవలం 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి మాత్రమే ఎందుకు వచ్చింది. కేసీఆర్‌కు 1000 ఎకరాల ఫాంహౌజ్ ఉందంటూ అబద్ధాలు మాట్లాడారు. దీన్ని రేవంత్ నిరూపించాలి. అసెంబ్లీకి ప్రతిసారి అంటున్నారు. మేము కూడా ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్నాం. 

Also Read: ఒకొక్కరుగా వస్తారో, అందరూ కలిసి వస్తారో రండి: సీఎం రేవంత్ సవాల్

రాష్ట్రంలో 5.19 లక్షల క్వింటాళ్ల సన్న వడ్లను క్వింటాలుకు రూ.500 బోనస్‌తో కొన్నట్లు ప్రభుత్వం చెప్పింది. ఈ లెక్కన చూస్తే బోనస్‌ రూ.26 కోట్లు మాత్రమే. ఒకవేళ రైతుబంధు పథకం అమలు చేస్తే ఏడాదికి రూ.7500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. కాంగ్రెస్ వస్తే రైతుబంధును తీసేస్తారని కేసీఆర్‌ గతంలోనే హెచ్చరించారు. రైతులను విజయవంతంగా మోసం చేస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుకుంటారా " అని హరీశ్‌ రావు విమర్శలు చేశారు.  

Also read: కోర్టు సంచలన తీర్పు.. 141 ఏళ్లు జైలు శిక్ష.. ఎందుకంటే?

Also Read: పులి మనిషి రక్తానికి మరిగిందా.. లక్ష్మిపై దాడిలో భయంకర నిజాలు!

Advertisment
తాజా కథనాలు