/rtv/media/media_files/2026/01/28/ajit-pawar-2026-01-28-18-16-45.jpg)
why Ajit Pawar patched up with mentor and uncle Sharad Pawar
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. రాబోయే రోజుల్లో అక్కడి రాజకీయ పరిస్థితులు మారనున్నాయనే వార్తలు వస్తున్నాయి. అజిత్ పవార్ 2023లో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి తన మద్దతుదారులతో సొంత వర్గాన్ని ఏర్పాటుచేసుకోవడం అప్పట్లో దుమారం రేపింది. అసలు ఆయన శరద్ పవార్‌కు ఎందుకు దూరమయ్యారు? దీని వెనుకున్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం .
మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్ కుటుంబ బలమైన శక్తిగా ఉంది. ఆ పార్టీ ఫౌండర్ శరద్ పవార్ మహారాష్ట్రకు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈయన సోదరుడు అనంత్ రావు పవార్ కొడుకే అజిత్ పవార్. 1959, జులై 22న జన్మించిన అజిత్ పవార్.. 23 ఏళ్ల వయసులోనే ఒక సహకార షుగర్ ఫ్యాక్టరీ బోర్డు సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. 1991లో పూణే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా పనిచేశారు. అదే ఏడాది బారామతి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో తొలిసారిగా అడుగుపెట్టారు. అజిత్ పవార్ ఎప్పుడూ కూడా శరద్ పవార్‌కు తానే రాజకీయ వారసుడినని భావించేవారు. కానీ కాలం గడిచే కొద్ది పరిస్థితులు మారుతూ వచ్చాయి.
2009లో శరద్ పవార్ కూతురు సుప్రియా సూలే రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుండి అజిత్ పవార్‌లో అభద్రతా భావం మొదలైంది. ముఖ్యంగా 2023లో సుప్రియా సూలేను పార్టీ 'వర్కింగ్ ప్రెసిడెంట్'గా నియమించడంతో అజిత్ పవార్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతోందని భావించారు. అంతేకాదు అజిత్ పవార్‌కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరిక ఉండేది. 2024లో అజిత్ పవార్ మాట్లాడుతూ.. తాను శరద్ పవార్ కొడుకుని కానందువల్లే పార్టీ పగ్గాలు చేపట్టే అవకాశం రాలేదంటూ అసహనం వ్యక్తం చేశారు.
Also Read: అజిత్ పవార్ ఫ్లైట్ యాక్సిడెంట్.. పైలట్ శాంభవి పాఠక్ గురించి సంచలన విషయాలు!
బీజేపీతో కలిసి వెళ్లాలనే దానిపై అజిత్, శరద్ పవార్‌ల మధ్య చాలాకాలంగా చర్చలు నడిచాయి. అజిత్ పవార్ వాదన ప్రకారం.. అభివృద్ధి కోసం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి వెళ్లాలని భావించారు. కానీ శరద్ పవార్‌కు మాత్రం తన 'లౌకికవాద' సిద్ధాంతం వల్ల బీజేపీతో కలిసేందుకు ఇష్టపడలేదు. ఈ సిద్ధాంతపరమైన ఘర్షణే 2023లో పార్టీ చీలికకు కారణమయ్యింది.
మరోవైపు అజిత్ పవార్ ఆయన సహచరులపై పలు కేసులు ఉన్నాయి. వీటిపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. బీజేపీతో కలిస్తే ఈ కేసుల నుండి ఉపశమనం లభిస్తుందని అజిత్ పవార్ వర్గం భావించిందని రాజకీయ నిపుణులు చెబుతుంటారు. ఈ క్రమంలోనే 2023 జూలై 2న అజిత్ పవార్ తన మద్దతుదారులతో కలిసి శివసేన- (షిండే)-బీజేపీతో కలిశారు. మహాయుతి కూటమితో ఎన్నికల బరిలోకి దిగిన ఈ మూడు పార్టీలు విజయం సాధించాయి. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లు బాధ్యతలు స్వీకరించారు.
Also Read: ట్రంప్‌కు అగ్ని పరీక్ష.. అమెరికాలో మళ్లీ ఎన్నికలు
Follow Us