ఫార్ములా ఈ - కార్ రేసులో ఈ రోజు ఏసీబీ విచారణకు IAS అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. ఆయనను ముగ్గురు ఏసీబీ అధికారుల బృందం విచారించింది. ఫార్ములా ఈ - కార్ రేసులో నిధుల మళ్లింపుపై ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కంపెనీకి నగదు బదిలీ వెనుక అసలు ఉద్దేశం ఏంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎవరి ఒత్తిడితో నగదు బదిలీ చేశారని అడిగినట్లు తెలుస్తోంది. నగదు బదిలీకి RBI అనుమతి ఉందా అని ACB అడిగినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TGPSC: గ్రూప్-3 ప్రిలిమినరీ 'కీ' విడుదల.. ఇదిగో లింక్
కేటీఆర్ ఆదేశాలతోనే..
కేటీఆర్ ఆదేశాలతోనే నగదు రిలీజ్ చేశాని ఏసీబీ విచారణలో అరవింద్ కుమార్ స్పష్టం చేసినట్లు సమాచారం. కేబినెట్ అనుమతి లేకుండా ఎందుకు రిలీజ్ చేశారని ఏసీబీ అధికారుల ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. గ్రీన్‌కో స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలడానికి కారణం ఏంటని కూడా అడిగినట్లు సమాచారం. అరవింద్ కుమార్ స్టేట్‌మెంట్ ను ఏసీబీ రికార్డు చేసింది. అరవింద్ కుమార్ చెప్పిన సమాధానాల ఆధారంగా కేటీఆర్ ను విచారించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: TGPSC: కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్‌పై TGPSC కీలక ప్రకటన..
కేటీఆర్ కు హైకోర్టులో ఊరట..
ఇదిలా ఉంటే.. కేటీఆర్ కు హైకోర్టులో స్వల్ప ఊరట లబించింది. సీసీ టీవీ పర్యవేక్షణలో విచారణ జరపాలని ఆదేశించింది. విచారణ జరుగుతున్న సమయంలో లాయర్ లైబ్రరీ రూంలో కూర్చునేందుకు అనుమతి ఇచ్చింది. విచారణ జరుగుతున్న గదిలోకి లాయర్ కు అనుమతి ఉండదని న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణ విషయంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టుకు రావచ్చునని కేటీఆర్ కు ధర్మాసనం సూచించింది.