సిద్దిపేట రోడ్లపై..హరీష్ను ఉరికిస్తాం | Mynampally Hanumanth Rao Strong Comments On Harish Rao| RTV
మైనంపల్లి హనుమంతరావు ఆస్తులపై విచారణ జరిపించాలంటూ ప్రముఖ న్యాయవాది రామారావు లోకాయుక్తాలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది. ఆరోపణలపై విచారణకు ఆదేశించింది.
తనకు పార్టీ టికెట్ ఇచ్చినా తన తనయుడి టికెట్ కోసం పోరు మొదలు పెట్టిన మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు వ్యహారం బీఆర్ఎస్ లో ముదురుతోంది. కొడుకుకు టికెట్ విషయంలో మంత్రి హరీశ్ రావు పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మైనంపల్లి ఇంకా తాను అదే స్టాండ్ పై ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లే అని మరోసారి స్పష్టం చేశారు..
అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఒక పది మంది మినహా అంతా సిట్టింగ్లకే మళ్లీ అవకాశం ఇచ్చారు. అయితే ఈ లిస్టులో అగ్రకులాలకే ఎక్కువ సీట్లు కేటాయించడం గమనార్హం.