/rtv/media/media_files/2025/05/22/D02O7iYKHsXcQSfOPC47.jpg)
Hanuman Jayanti celebrations
Kondagattu : తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాలు ఈ రోజు ఘనంగా జరగనున్నాయి. మంగళవారం నుంచే వేడుకలు ప్రారంభమైనప్పటికీ హనుమాన్ దీక్షాస్వాములు గురువారం మాల విరమణ చేయనుండటంతో దేవాలయాన్ని సర్వంగా సుందరంగా అలంకరించారు. తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలనుంచి కూడా లక్షలాదిగా అంజన్న దీక్షపరులు, భక్తులు కాలినడకన, వివిధ మార్గాల ద్వారా కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధికి చేరుకోనున్నారు. మాల విరమణ కోసం ఆలయ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: మావోయిస్ట్ అగ్రనేత కేశవరావు హతం.. వరంగల్ NITలో బీటెక్ చేసి ఉద్యమంలోకి..
కొండగట్టులో జరిగే ఉత్సవాల కోసం ఆలయ పరిసరాలలో భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు ఇప్పటికే పెద్ద ఎత్తున తరలివస్తూ స్వామివారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకుంటూ న్నారు. భక్తుల కోసం సుమారు నాలుగున్నర లక్షల లడ్డు ప్రసాదం అందుబాటులో ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Balagam Actor: దీనస్థితిలో బలగం నటుడు..కిడ్నీలు ఫెయిల్.. గొంతు ఇన్ఫెక్షన్తో
గురువారం కొండగట్టు అంజన్న క్షేత్రం జనసంద్రంగా మారింది. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాల నేపథ్యంలో దీక్షాధారులు భారీసంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవాల్లో రెండో రోజైన బుధవారం స్వామివారికి హోమం, నవగ్రహ ఆరాధన, సుందరకాండ పారాయణం, అభిషేకము నిర్వహించారు. మధ్యాహ్నం సహస్రనామార్చన, మహా నివేదన, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ చేశారు. సాయంత్రం కుంకుమార్చన, పారాయణం, హోమం జరిపారు.
Also Read: 50 బుల్డోజర్లు, 3 వేల మంది పోలీసులు.. 8,500 ఇళ్లు ఫసక్!
కొండగట్టుకు చేరుకున్న దీక్షాధారులు ముందుగా కోనేరులో స్నానమాచరించారు. అనంతరం అంజన్నను దర్శించుకొని మాలవిరమణ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి భక్తుల రాక పెరగడంతో అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో వైపు బుధవారం తెల్లవారుజాము నుంచి వర్షం పడడంతో భక్తులు కొంత ఇబ్బందికి గురయ్యారు. గాలివానకారణంగా వై జంక్షన్ నుంచి గుట్టపై వరకు వేసిన టెంట్లు పూర్తిగా తడచి ముద్దయ్యాయి. ఈ రోజు కూడా వాతావరణంలో మార్పు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ తెలిపింది.
ఇది కూడా చూడండి:TGCrime : భర్త ఫోన్ కు అశ్లీల ఫోటోలు పంపిన కానిస్టేబుల్...! ఉరేసుకుని భార్య...