US Gun Fire: అమెరికాలో కాల్పులు.. తెలంగాణ విద్యార్థి దుర్మరణం! అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణకు చెందిన నూకారపు సాయితేజ కాల్పుల్లో కన్నుమూశాడు. 4 నెలల క్రితం చికాగో కాంకోడియా యూనివర్శిటీలో ఎంఎస్ చదివేందుకు అమెరికి వెళ్లిన్నాడు. సాయితేజ మృతితో స్వస్థలం ఖమ్మంలో విషాధ చాయలు అలుముకున్నాయి. By Vijaya Nimma 30 Nov 2024 in తెలంగాణ క్రైం New Update TG Crime షేర్ చేయండి TS News: అమెరికాకు ఉన్నత చదువులకోసం వెళ్లిన తెలుగు విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన రేపుతున్నాయి. తాజాగా అమెరికాలో మరో తెలుగు విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. తెలంగాణకు చెందిన నూకారపు సాయితేజ (22) శుక్రవారం జరిగిన కాల్పుల్లో కన్నుమూశాడు. నాలుగునెలల క్రితం చికాగో కాంకోడియా యూనివర్శిటీలో ఎంఎస్ చదివేందుకు అమెరికి సాయితేజ్ వెళ్లిన్నాడు. కౌంటర్ మేనేజర్‌గా విధులు.. Also Read: పండ్ల రసాల్లో రసాయనాలు ఎలా గుర్తించాలి? ఎంఎస్ చదువుతూనే ఓఫుడ్ జోన్‌లో కౌంటర్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. క్యాష్ కౌంటర్‌లోకి చొరబడి నగదు కాజేసి సాయితేజను కాల్చి చంప్పారు దుండగులు. సాయితేజ మృతితో స్వస్థలం ఖమ్మం నగరంలో విషాధ చాయలు అలుముకున్నాయి. ఖమ్మం నగరానికి చెందిన కాంట్రాక్టర్ నూకారపు కోటేశ్వర్ రావ్, వాణీల రెండో సంతానం నూకారపు సాయితేజ. Also Read: నువ్వులు తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా? మొదటి కుమార్తె ప్రియ అమెరికాలోనే జాబ్ చేస్తున్నట్లు సమాచారం. సాయితేజ మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు ఎన్ఆర్ఐ ఫౌండేషన్, తానా ఫౌండేషన్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈరోజు, రేపు సెలవు దినం కావడంతో సాయితేజ మృతదేహం భారత్‌కు చేర్చడంలో మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. Also Read: మేనమామ కాదు కాలయముడు..ఆస్తి కోసం దారుణం ఇది కూడా చదవండి: ప్లీజ్ నాన్న మమ్మల్ని చంపొద్దు.. కాళ్లు పట్టుకున్నా కనికరించని తండ్రి #us gun fire #usa #khammam #gun-fire #telugu-student #america మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి