Liquor Shop Application : మద్యం దుకాణాల దరఖాస్తులపై ప్రభుత్వం కీలక నిర్ణయం...మరో నాలుగు రోజులు పాటు

 మద్యం షాపుల టెండర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో.. మద్యం షాపుల టెండర్ల గడువును అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

New Update
wines closed

 Liquor Shop Application

Liquor Shop Application:  మద్యం షాపుల టెండర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం(telangana-liquor-shops-tenders) కీలక నిర్ణయం తీసుకుంది. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో.. మద్యం షాపుల టెండర్ల గడువును అక్టోబర్ 23వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ హరి కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక టెండర్ల గడువును పొడిగించడంతో ఈ నెల 23వ తేదీన జరగాల్సిన మద్యం షాపుల డ్రాను కూడా వాయిదా వేశారు. శనివారం బంద్ కారణంగా పలు  బ్యాంకులు తెరుచుకోలేదు. దీంతో మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయాలనుకున్నవారికి నిరాశ ఎదురైంది. దరఖాస్తులపై బంద్ ప్రభావం చూపిందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును పెంచుతూ ఎక్సైజ్ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. కాగా గతేడాదితో పోలిస్తే.. ఈ ఏడాది భారీగా ఈ దరఖాస్తులు తగ్గాయని తెలుస్తోంది.  

నిజానికి శనివారం సాయంత్రంతో ఈ మద్యం దుకాణాలకు దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాకపోవడం, బ్యాంకుల బంద్‌ మూలంగా దరఖాస్తు చేసే అవకాశం లేకపోవడం వంటి కారణాలతో చివరి నిమిషంలో ఈ దరఖాస్తుల గడువు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు చివరిరోజు అని ప్రకటించిన శనివారం రోజున భారీగా దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈ ఒక్క రోజే 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకు మొత్తం 90 వేలకుపైగా దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read :  వారికి మావోయిస్టులతో సంబంధాలు...వెంటనే  తెంచుకోండి..లేదంటే...బండి సంజయ్ వార్నింగ్

ఒక మహిళ..150 దరఖాస్తులు

కాగా, తెలంగాణ వైన్స్‌కు ఇక్కడి వారు టెండర్లు వేయడానికి వెనుకడుగు వేస్తుంటే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక మహిళ దాదాపు 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. అదీకూడా ఏపీకి సరిహద్దుల్లో ఉండే జిల్లాల్లోని మద్యం దుకాణాలకు ఆమె అధికంగా దరఖాస్తు చేసినట్టు  ప్రచారం సాగుతోంది. సంగారెడ్డి జిల్లాల్లో 101 మద్యం దుకాణాలకు 4,190 దరఖాస్తులు రాగా.. మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాలకు 1,369 టెండర్లు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలు కూడా మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తు చేయడం విశేషంగా మారింది.

Also Read: ఈ అక్కాచెల్లెళ్లు మామూలోల్లు కాదు.. పెళ్లిళ్లు చేసుకుంటూ డబ్బులు, నగలతో పరార్‌

Advertisment
తాజా కథనాలు