Telangana Ration Cards : రేషన్​కార్డు దారులకు గుడ్ న్యూస్.. ఊగాది నుంచి కార్డుపై...

తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ ఉగాది నుంచి కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వడంతో పాటు పేదలకు రేషన్​కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సన్నబియ్యం కోసం పౌరసరఫరాల శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.5,734 కోట్లు కేటాయించింది.

New Update
Telangana Ration Cards

Telangana Ration Cards

Telangana Ration Cards : తెలంగాణ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ ఉగాది నుంచి కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వడంతో పాటు పేదలకు రేషన్​కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గత ప్రభుత్వంలో  పేదలకు రేషన్‌ కార్డులు ఇవ్వలేదని ప్రభుత్వం ఆరోపిస్తున్నది. కనీసం కొత్త కుటుంబ సభ్యుల పేర్లను కూడా రేషన్‌ కార్డులో జతచేయలేదని పేర్కొంది.  ప్రజల ఆకాంక్షలను గుర్తించి తమ ప్రభుత్వం అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు ఇవ్వాలని, వారికి సన్నబియ్యం ఇవ్వాలని కూడా నిర్ణయించిందని ప్రభుత్వం తెలిపింది. నూతన రేషన్‌ కార్డుల జారీ , అదనపు కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేసే ప్రక్రియ ఈ ఏడాది జనవరి 26 నుంచి ప్రారంభించామని ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికశాఖమంత్రి భట్టి విక్రమార్కమల్లు ప్రకటించారు. రేషన్‌కార్డులు, సన్నబియ్యం కోసం పౌరసరఫరాల శాఖకు ఈ బడ్జెట్‌లో రూ.5,734 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

Also Read :  లాభాల్లో కదలాడుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..

ఇక పేదలకు రేషన్​కార్డులపై సన్న బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్​ రెడ్డి ఉగాది పండుగ రోజున లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏప్రిల్​ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్​షాపుల్లో దొడ్డు బియ్యానికి బదులుగా సన్నబియ్యం ఇచ్చేందుకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రేషన్​కార్డుల్లో లబ్ధిదారుల సంఖ్య ప్రకారం ఒక్కొక్కరికీ 6 కిలోల సన్న బియ్యం ఇవ్వనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 91,19,268 రేషన్‌కార్డులు ఉన్నాయి. ఇందులో లబ్ధిదారులు 2,82,77,859 మంది ఉన్నారు.

Also read :  కర్ణాటకలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్‌ వేటు

ఉగాది పర్వదినాన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు.వాస్తవానికి జనవరి నుంచే రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే కొత్త రేషన్ కార్డులు ఇచ్చాకే దీన్ని లాంచ్ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ కొత్త రేషన్ కార్డుల విషయంలో సందిగ్ధత నెలకొంది. ఏ విధంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి అనేదానిపై ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది.దీంతో పాత రేషన్ కార్డుదారులకే సన్నబియ్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించింది. 

Also Read: ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న 'లూసిఫర్‌2: ఎంపురాన్‌' ట్రైలర్..!

Advertisment
తాజా కథనాలు